Home ఆఫ్ బీట్ ఆడిందే ఆటగా గ్యాస్, రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం

ఆడిందే ఆటగా గ్యాస్, రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం

gas

మన తెలంగాణ/షాపూర్‌నగర్ : అడిగేవారు లేక కుత్బుల్లాపూర్‌లో రేషన్ డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కుత్బుల్లాపూర్ పరిధిలో సివిల్ సప్లైఅధికారుల కొరత అక్రమార్కులకు వరంగా మారింది. గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఎవరిని కేటాయించక పోవడంతో గ్యాస్, మరియు రేషన్ డీలర్ల ఆగడాలు రోజు రోజుకూ పెరుగిపోతున్నాయి.

కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలోని జంట సర్కిళ్లైన గాజులరామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్లకు గతంలో ఇద్దరు సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు. కాలక్రమేణా వారిలో ఒకరు బదిలీ కావడంతో ఆస్థానంలో మరొకరిని కేటాయించలేదు. ప్రస్తుతానికి ఉన్న ఒక్క అధికారి కూడా కేవలం సీటుకే పరిమితం అవుతూ ఫీల్డ్‌కు రాకుండా ఫోన్ ద్వారానే విధులు నిర్వహిస్తూన్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు, డీలర్లు, గ్యాస్‌ఏజెన్సీ నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూన్నారు.

నిత్యకృత్యం అవుతున్న సమస్యలు

ration-dealers

చింతల్, ఐడిపిఎల్ పరిధిలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ బుక్ చేసిన వారికి బిల్లుమీద అదనంగా రూ.20 నుంచి రూ.50 డెలివరీ బాయ్స్ వసూల్ చేస్తూన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కుత్బుల్లాపూర్ బాల్‌రెడ్డి నగర్‌లోని ఓ రేషన్ దుకాణంలో రేషన్ బియ్యం కోసం వినియోగదారులు వెళితే కేవలం బియ్యం తీసుకునే వారు అయితే ఇతర షాపులో తీసుకోండి, ఇక్కడకు రావోద్దు చింతపండు, కందిప ప్పు, సబ్బులు ఇతర వస్తువులు కొంటేనే ఇక్కడ రేషన్ బియ్యం ఇస్తాం అనే స్థాయి లో డీలర్ రెచ్చిపోతున్నా సివిల్ సప్లై అధికారి లేకపొవడంతో సమస్య నిత్యకృత్యం అవుతందని బాధితులు వాపోతున్నారు.

గ్యాస్ డీలర్ల నుంచి సిలిండర్లను డెలివరీ బాయ్స్ హోటల్లో నేరుగా సప్లై చేస్తున్నా వీరిపై సంబంధిత శాఖ నిఘా లేకపోవడంతో డొమెస్టిక్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు యథేచ్ఛగా తరులుతున్నాయి. ఇలా వివిధ ర ంగాల్లో నిఘా ఉంచాల్సిన సివిల్ సప్లై శాఖ అధికారులు కేవలం ఆఫీస్‌కే పరిమితం అవుతున్నారని విమర్శలున్నాయి. ఇదేమిటని ఎవరైనా బాల్‌నగర్‌లోని కా ర్యాలయానికి వెళ్లి అడిగితే సిబ్బంది కొరత ఉంది వెళ్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పిరండి అంటూ ఉచిత సలహాలు ఇస్తూన్నారని వినియోగదారులు వాపోతున్నా రు. సంబంధిత ఉన్నతాధికారులు కుత్బుల్లాపూర్‌లో సివిల్ సప్లై శాఖలో నెలకొన్న అధికారుల కొరత సమస్యపై దృష్టి సారించి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.