Home తాజా వార్తలు గ్యాస్‌ సిలిండర్‌ పేలి… ఏడు లక్షల ఆస్తి నష్టం

గ్యాస్‌ సిలిండర్‌ పేలి… ఏడు లక్షల ఆస్తి నష్టం

Gas Cylinder Blast In Munagala At Suryapetనల్లగొండ: మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో గురువారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో సుమారు రూ.7లక్షల ఆస్తినష్టం జరిగింది. గ్రామానికి చెందిన లక్షయ్య ఇంట్లో వంట చేస్తున్న సమయంలో  గ్యాస్‌ సిలిండర్ ఒక్కసారిగా పేలి, ఇంటికి  మంటలు అంటుకున్నాయి. దీంతో   ఇంటితో పాటు రూ.6 లక్షల నగదు, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్ష్మయ్య ఇటీవల పొలం అమ్ముకోగా రూ.9లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని లక్ష్మయ్య  బీరువాలో భద్రపరచాడు. ఈ మొత్తంలో రూ.6లక్షలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిరుపేద లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.