Tuesday, September 26, 2023

ఆదిభట్లలో ట్యాంకర్ బోల్తా

- Advertisement -
- Advertisement -

Gas tanker accident in Adibatla

రంగారెడ్డి: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. భారీ గ్యాస్ ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. చర్లపల్లి నుంచి తిమ్మాపూర్ కు ఎల్ పిజి గ్యాస్ తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను దారి మళ్లించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Gas tanker accident in Adibatla

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News