Home తాజా వార్తలు జల సోయగం…

జల సోయగం…

Gauri gundala Waterfall

 

పెద్దపల్లి : చుట్టూ పరుచుకున్న పచ్చదనం.. మద్యలో గుట్టపై నుండి జాలువారే జలధార.. ఇలా సబ్బింతం గౌరిగుండాల జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. గత నెల రోజులనుండి కురుస్తున్న వర్షాలకు గుట్టపై నుండి వస్తున్న ధారను చూసి పలువురు మరిసిపోతున్నారు. ఆ ధార కింద చిన్నపిల్లలు, యువకులు నిలబడి సంతోషంతో మునిగిపోతున్నారు. జలపాతాన్ని విక్షించేందుకు పెద్దపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాల, ఇతర ప్రాంతాల ప్రజలు కూడ వస్తున్నారు. సెలవుదినం ఆదివారం వచ్చింది అంటే సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ పికినిక్ స్పట్‌గా మారింది. పెద్దపల్లి జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల వాసులకు దగ్గర కావటంతో పర్యాటకులు పెరిగిపోతున్నారు. ఇటీవల దారికి టోల్ గేట్ కూడ ఏర్పాటు చేశారు.

రవాణ సౌకర్యం… మనోజ్‌కుమార్, రాఘవాపూర్
పెద్దపల్లి నుండి సబ్బితం గౌరి గుండాల జలపాతంకు 13 కి.మీ దూరం అంతే. పెద్దపల్లి నుండి మంథనికి వెళ్లె దారిలో సబ్బితం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టు సింగారం. పెద్దపల్లి నుండి ఆటోలు, బస్సులు, బైక్‌లపై కూడ వెళ్లవచ్చు. అలాగే గోదావరిఖని నుండి అడ్డగుంటపల్లి రోంపికుంట మీదుగా పేరపల్లి నుండి కూడ సబ్బితంకు రావటానికి వాహనాలు ఉంటాయి.
జలపాతం చాలా బాగుంది…

మనోజ్‌కుమార్, రాఘవాపూర్

చూట్టు గుట్టలు, పచ్చని వాతావరణం చాలా ఆహ్లదకరంగా ఉంది. కానీ ఇక్కడ వరకు తారురోడ్డు గాని సీసీ రోడ్డు గాని వేస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షాకాలం అప్పుడు మాత్రమే జలపాతం కనిపిస్తుంది. వర్షం పడితే మట్టి రొడ్డు కావటం చేత వాహనాలు పోవటం ఇబ్బందిగా ఉంది. దీనిపై గ్రామపంచాయతీ పాలక వర్గం దృష్టి సారిస్తే మరింత అభివృద్ది జరుగుతుంది.
సౌకర్యాలు కల్పించాలి…

జలపాతం వద్ద పిల్లలకు వస్తారు. వారికి ఆట వస్తువులు కొన్నింటిని అమర్చాలి. దీనితో వారికి ఆటలకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వాహనాలు అక్కడ వరకు రావాలంటే రొడ్డు బాగుండాలి. నడిచి పోవాలంటే పిల్లలు ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.
మంచిర్యాల నుండి వచ్చా…

మేకల సురేందర్
నేను మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ నుండి వచ్చాను. ఇక్కడ దూరం తక్కువ తో పాటు రావటానికి రవాణ ఇబ్బందులు తక్కువ. మేము సెలవు దినం కావున ఇక్కడకు వచ్చి పిల్లలతో గడిపాం. చాలా బాగుంది. పర్యాటకులు కూడ చాలా మంది వచ్చారు.

Gauri gundala Waterfall is Attractive Tourist place