Friday, June 13, 2025

టెస్ట్‌ల నుంచి కోహ్లీ రిటైర్.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) షాకింగ్ న్యూస్ అందించాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని కలచి వేసింది. తమ అభిమాన క్రికెటర్‌ని ఇక వైట్ జెర్సీలో చూడలేమా అంటూ బాధపడ్డారు. మరికొందరు మాత్రం ఈ ఛాంపియన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించారు. అన్ని అభినందిస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) కూడా విరాట్ గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

‘సింహం లాంటి పాషన్ కలిన వ్యక్తి.. మిస్ య చీక్స్’ అంటూ గంభీర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. గంభీర్‌తో పాటు పలువు మాజీలు, విదేశీ క్రికెటర్లు కూడా విరాట్‌కు(Virat Kohli) రిటైర్‌మెంట్‌పై శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 254 పరుగులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News