Thursday, April 25, 2024

రోల్‌మోడల్స్ కనిపించడం లేదు

- Advertisement -
- Advertisement -

Gautam gambhir

 

గౌతం గంభీర్

న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియాలో రోల్‌మోడల్స్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా గంభీర్ కూడా యువరాజ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు చెప్పాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలు వెల్లడించాడు. గతంలో సచిన్ టెండూల్కర్, గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్, కుంబ్లే వంటి క్రికెటర్లు ఉండేవారని, జట్టులోకి కొత్తగా వచ్చే యువ ఆటగాళ్లకు వీరంతా పలు సలహాలు సూచనలు ఇచ్చేవారన్నాడు.

ప్రస్తుతం భారత జట్టులో అటువంటి సంప్రదాయం కనిపించడం లేదన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప యువ క్రికెటర్లను పట్టించుకునే వారే లేకుండా పోయారన్నాడు. ఇక, యువ ఆటగాళ్లు కూడా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నారని, పెద్ద మొత్తంలో లభిస్తున్న డబ్బు ప్రభావం వీరిపై స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. గతంలో జాతీయ జట్టులో చోటు లభిస్తే ప్రతి క్రికెటర్ సర్వం ఒడ్డి పోరాడేవాడని, సీనియర్లకు తగినంత గౌరవం ఇచ్చేవాడన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అటువంటి సంప్రదాయం కనిపించడం లేదని గంభీర్ వాపోయాడు.

Gautam gambhir said about team india
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News