Home తాజా వార్తలు గాయత్రి ఆరో బాహుభళీ

గాయత్రి ఆరో బాహుభళీ

Gayatri Pumphouse

 

కాళేశ్వరం గాయత్రి పంప్‌హౌజ్
ఆరో పంప్ వెట్ రన్ విజయవంతం

దిగువకు నీటిని వదిలిన అధికారులు

హైదరాబాద్/కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌజ్‌లోశనివారం నిర్వహించిన మూడోపంపు వెట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్‌లో మొత్తం ఏడు బాహుబలి పంపులను ఏర్పాటు చేయగా ఇప్పటికే 1,2,4,5,6 పంపులను అధికారులు వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఏడు పంపుల్లో ఐదు పంపులకు వెట్ ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. ఇందులో ఒకవైపు మిడ్ మానేరుకు, మరో వైపు రివర్స్ పంపింగ్‌లో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌పికి నీటిని సరఫరా చేశారు.

కాగా, మూడోపంపు వెట్ ట్రయల్న్ కోసం ధర్మారం మండలం నందిమేడారం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి నీటిని నేడు వదలగా నేరుగా ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌజ్ సర్జిఫూల్‌కు చేరుకొంది. భూగర్భంలోని కంట్రోల్‌రూమ్‌లో రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి మోటార్‌ను ప్రారంభించగా ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ డెలివరీ సిస్టమ్ వద్ద ఉండి పర్యవేక్షించారు.

సాయంత్రం 6 గంటల వరకు మూడుసార్లు సైరన్ మోగించిన అధికారులు 6.20 గంటలకు మూడోపంపు వెట్ ట్రయల్ రన్ నిర్వహించారు. సుమారు గంటపాటు నడిపించి మోటార్‌ను ఆపేశారు. కాగా, మూడోమోటార్ వెట్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్రాజెక్టు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏఈఈలు సురేశ్, శ్రీనివాస్, రమేశ్, ట్రాన్స్‌కో డీఈఈ దీకొండ భూమయ్య, మెగా ఏజన్సీ ప్రతినిధులు ఉన్నారు.

Gayatri Pumphouse Successful Sixth Pump Wet Run