Friday, March 29, 2024

జిహెచ్ఎంసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Gazette release of winning candidates in GHMC elections

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో గెజిట్ నోటిఫికేషన్ ఎస్ఇసి జారీ చేసింది. డిసెంబర్ 4న జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈ నెలాఖరులో మేయర్ ఎన్నిక తేదీ ఖరారు చేయాలని ఎస్ఇసి స్పష్టం చేసింది. త్వరలోనే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిహెచ్‌ఎంసిలో మొత్తం 150 డివిజన్లకు గాను టిఆర్‌ఎస్‌-56, బిజెపి-48, మజ్లిస్‌-44, కాంగ్రెస్‌-2 స్థానాల్లో విజయం సాధించాయి.

Gazette release of winning candidates in GHMC elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News