Home తాజా వార్తలు జిడిపి వృద్ధి రేటు 7.7 శాతం

జిడిపి వృద్ధి రేటు 7.7 శాతం

bs

ముంబై: ఎట్టకేలకు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(201718) చివరి త్రైమాసికంలో దేశీయ వృద్ధి రేటు మెరుగైంది. జనవరి మార్చి కాలంలో వృద్ధి రేటు 7.7 శాతానికి పెరిగింది. పూర్తి సంవత్సరానికి గాను 6.7 శాతం వృద్ధి నమోదైంది. తాజా గణాంకాలను సిఎస్‌ఒ(కేంద్ర గణాంకాల శాఖ) విడుదల చేసింది. మార్చిలో భారత్ వృద్ధి రేటు ఈసారి చైనా వృద్ధి రేటు 6.8 శాతాన్ని అధిగమించింది. దీంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2017 క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగానే ఉంది. ఇంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. వృద్ధి రేటు అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
* 201718 ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరిమార్చి)లో దేశీయ వృద్ధి రేటు 7.7 శాతం నమోదైంది. దీనికి క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో 7.2 శాతం, క్యూ2(జులైసెప్టెంబర్)లో 6.3 శాతం, క్యూ1(ఏప్రిల్‌జూన్)లో 5.6 శాతంగా జిడిపి వృద్ధి రేటు ఉంది.
* వ్యవసాయం(4.5 శాతం), ఉత్పత్తి రంగం(9.1 శాతం), నిర్మాణ రంగం(11.5 శాతం)లో వేగవంతమైన వృద్ధి మొత్త జిడిపి వృద్ధి రేటుకు దోహదం చేసింది.
* వ్యవసాయం & అనుబంధ రంగాలు, పరిశ్రమ, సేవల రంగాలకు వృద్ధి రేటు వరుసగా 4.5 శాతం, 8.8 శాతం, 7.7 శాతంగా అంచనా వేశారు.
* స్థూల స్థిరమైన మూలధన ఏర్పాటు వృద్ధి రేటు నాలుగో త్రైమాసికంలో 14.4 శాతంగా ఉంది
* దేశీయ ఆదాయం తాత్కాలిక అంచనాల ప్రకారం, 2017-18 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా వేశారు.
* వ్యవసాయం & అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలకు వరుసగా వృద్ధి రేటు 3.4 శాతం, 5.5 శాతం, 7.9 శాతం ఉండవచ్చని అంచనా వేశారు.
* గతంలో విడుదల చేసిన 2017-18 నాటి క్యూ1, క్యూ2, క్యూ3 వృద్ధి రేటుతో సహా అంచనాలు.. జాతీయ ఖాతాల విధానానికి అనుగుణంగా సవరించారు.
* 2017-18 నాటికి జిడిపిని రూ.34.77 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. అంతకుముందు 2016-17 కూ4లో రూ. 32.27 లక్షల కోట్లతో పోలిస్తే వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది.
* 2017-18 సంవత్సరానికి జాతీయ ఆదాయంలో రెండో ముందస్తు అంచనాలు ఫిబ్రవరి 28న విడుదల చేయగా.. ఇప్పుడు సవరించారు.
* 2017-18 సంవత్సరానికి వాస్తవ జిడిపి రూ. 130.11 లక్షల కోట్లుగా అంచనా వేసింది. 2016-17 సంవత్సరానికి జిడిపి రూ.121.96 లక్షల కోట్లతో పోలిస్తే 6.7 శాతం వృద్ధిరేటు ఉంది.