Home బిజినెస్ నోట్ల రద్దుతో మూడేళ్ల కనిష్ఠానికి జిడిపి

నోట్ల రద్దుతో మూడేళ్ల కనిష్ఠానికి జిడిపి

  • వృద్ధి రేటు 7.1 శాతం
  • 6.1 శాతంతో నెమ్మదించిన వృద్ధి రేటు

GDP

ముంబయి : వ్యవసాయ రంగం మెరుగ్గా ఉన్నప్పటికీ నోట్ల రద్దు ప్రభావంతో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు నెమ్మదించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1 శా తంగా నమోదైన జిడిపి మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 6.1 శాతా నికి తగ్గుముఖం పట్టింది. ఇంతలా తగ్గడానికి కారణంగా 2016 నవంబర్ 9న డిమానిటైజేషన్ ప్రకటన చేయడంతో ఆ తర్వాత త్రైమాసిక వృద్ధి రేటుపై ప్రభావం చూపింది. మోడీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సంద ర్భంగా వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రధానంగా తయారీ, సేవల రంగం అధ్వాన్నంగా ఉండడంతో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. బుధవారంనాడు కేం ద్ర గణాంకాల కార్యాలయం(సిఎస్‌ఒ) ఈ వివరాలను విడు దల చేసింది. అంచనాలను ఈ గణాంకాలు అందుకోలేదు. 2015-16 సంవత్సరంలో వృద్ధి రేటు 8 శాతం వద్ద ఉంది. అంతకుముందు ఏడాదిలో 7.5 శాతం నమోదైంది. వ్యవ సాయ రంగం మెరుగైన పనితీరును చూపినప్పటికీ గత ఆర్థి క సంవత్సరంలో వృద్ధి మందగించింది. అయితే జనవరి-మార్చి త్రైమాసికానికి గాను చైనా వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంది. జిడిపి వృద్ధి రేటులో భారత్ తొలిసారి 2015లో చైనా ను అధగిమించింది. ఇప్పుడు మన వృద్ధి రేటు చైనాకు అటు ఇటుగానే ఉంది. కాగా 2016-17కు సంబంధించిన మొ త్తం ఏడాదిలో కూడా వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండడం మాత్రం అధికారులు అంచనాలకు అనుగుణంగానే ఉంది. మార్చి ముగింపు త్రైమాసికంలో వ్యవసాయం, అటవీ, మ త్స్య రంగాల్లో వృద్ధిరేటు 5.2 శాతం, మైనింగ్, క్వారింగ్‌లో 6.4 శాతం వృద్ధి ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. తయారీ రంగం 5.3 శాతం, విద్యుత్, గ్యాస్, మంచినీళ్ల సరఫరా, ఇతర వినియోగ సేవలు 6.1 శాతంగా ఉన్నాయి. వాణిజ్యం, రవాణా, సమాచారం 6.5 శాతం, ఆర్థికరంగం, రియల్ ఎస్టేట్, నిపుణుల సేవలు 2.2 శాతం నమోదవగా.. రక్షణ, ఇతర సేవలు 17 శాతంగా ఉన్నాయి.