Saturday, February 4, 2023

ఐదు కథల సమాహారం

- Advertisement -

Geethapuri-Colonyజి.ఆర్కే ఫిలింస్ సమర్పణలో డికొండ దుష్యంత్ కుమార్, జి.రామకృష్ణ నిర్మాతలుగా ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీతాపురి కాలనీ’. రామ్‌చరణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ తొలి సీడీని ఆవిష్కరించారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ “పాటలన్నీ ముందే విన్నాను. నాకు రెండు పాటలు విపరీతంగా నచ్చాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్య విలువలు కూడా ఉన్నాయి. ట్రైలర్ చూశాక సినిమా కథ ఊహించని విధంగా అనిపించింది. దీంతో సినిమా చూడాలన్న ఉత్సుకత కలిగింది” అని అన్నారు. జి.ఆర్కే ఫిలింస్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ “దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పిల్లల భవిష్యత్ మాత్రమే పాడవడం కాకుండా మొత్తం దేశమే పాడైపోతుందన్న అంశం నాకు బాగా నచ్చింది. అందుకే నా బ్యానర్‌లో ఈ సినిమా చేయమని దర్శక నిర్మాతలతో చెప్పాను. మా అబ్బాయి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర చేశాడు. సంగీత దర్శకుడు రామ్‌చరణ్ అద్భుతమైన పాటలనిచ్చాడు”అని చెప్పారు. చిత్ర నిర్మాత డికొండ దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ “మా అమ్మగారి సహకారంతో ఈ సినిమా నిర్మించగలిగాను. అలాగే రాంకీ అన్ని విధాలుగా సహకరించారు. సినిమా అంటే నాకెంత పిచ్చి, కసి ఉన్నాయో మా డైరెక్టర్‌లో కూడా అవి కనిపించడంతో ఈ సినిమా చేసే బాధ్యత తన చేతిలో పెట్టాను. సంగీత దర్శకుడు రామ్‌చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే ఇంత మంచి పాటలొచ్చాయి”అని అన్నారు. దర్శకుడు ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ మాట్లాడుతూ “ఐదు కథల సమాహారమే ఈ చిత్రం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక చోట తారసపడ్డ పాత్రలే ఇందులో ఉంటాయి. భద్రాచలం, పాల్వంచ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం”అని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles