Home తాజా వార్తలు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్‌లు పట్టివేత

జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్‌లు పట్టివేత

Gelatin sticks, detonators capture
మనతెలంగాణ/జూలూరుపాడు: జూలూరుపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా పేలుడు పదార్ధాలను తరలిస్తున్న కంప్రెషర్ వాహనంతోపాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ ఇ రాజేష్ తెలియచేసారు. బుధవారం ఎస్‌ఐ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం స్థానికంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా, క్వారీలలో పేలుళ్లకు వాడే కంప్రెషర్ ట్రాక్టర్‌తోపాటు 40 జిలెటిన్‌స్టిక్స్, 25 డిటోనేటర్‌లను ఎటువంటి అనుమతులు లేకుండా, మండల పరిధిలోని సూరారం వెళ్లే రోడ్డువైపుకు తరలిస్తుండగా, పోలీసులకు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీటితోపాటు సంపంగి రాజా, అళ్లకుంట అనిల్, దుంపా శ్రీరాం అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు వాహన యజమాని సంపంగి మల్లయ్య అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ కృష్ణారావు,బిడి గుప్తా, రాజు తదితరులు పాల్గొన్నారు.