Home తాజా వార్తలు చంపేస్తున్నారు

చంపేస్తున్నారు

Gender diagnostic tests

 

యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్కానింగ్ కేంద్రాలు
కాసుల మత్తులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం

రంగారెడ్డి : తల్లిగర్భంలోనే శిశువులను ఛిదిమేస్తున్నారు. గర్భంలో అడపిల్ల అని తెలిస్తే చాలు చావుగంట మోగిస్తున్నారు. కాసులు ఇస్తే చాలు కడుపులో ఉన్న పిండాన్ని కా టికి పంపించడానికి సిద్ధ్దమవుతున్నారు. రాష్ట్ర రాజదానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు యధేచ్చగా అ బార్షన్‌లు చేస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యం త్రాగం మాత్రం కాసుల మత్తులో మునిగితేలుతుం ది. హయత్‌నగర్‌లో తల్లిని దారుణంగా చంపిన కీర్తిరెడ్డికి జిల్లా పరిధిలోని అమన్‌గల్‌లో అబార్షన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించిన అనంతరం పద్మజా నర్సింగ్ హోమ్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యం త్రాంగం సీజ్ చేసింది తప్ప జిల్లాలో ఇలాంటి అడ్డగో లు వ్యవహారాలు సాగుతున్న వైనంపై కనీసం ఎ నా డు కూడా స్పందించిన దాఖలాలు లేవు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండానే జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు గల్లీ గల్లీలో వెలుస్తున్నా తమ అనుచరులను పంపి తమ కు కావలసిన నజారానాలు తీసుకోవడంపై చూపుతు న్న శ్రద్ధ అనుమతులు లేకుండా వెలుస్తున్నా వాటిపై చర్యలు తీసుకోవడంపై చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాసుల సంపాదనే ద్యేయంగా వెలుస్తున్న స్కానింగ్ కేంద్రాల ముందు తాటికాయ అంత ఆక్షరాలతో లింగ నిర్దారణ పరీక్షలు చేయబడవు అని రాసి ఉంటుంది తప్ప లోపల మాత్రం అదనపు డబ్బులు తీసుకుని చేస్తున్న పరీక్షలు మాత్రం అవేనని పలువురు పెర్కొంటున్నారు.

రంగారెడ్డి జిల్లాలో దాదాపు వేయికి పైగా స్కానింగ్ కేంద్రాలు నడుస్తున్న అందులో సగానికి కూడ అనుమతులు లేవని స్కానింగ్ కేంద్రాలలో కనీస అనుభవం లేని వారు పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం మాత్రం అంతా మామూళ్లే అన్న భావనతో ముందుకు సాగుతుంది. గర్బంలో అడ పిల్ల ఉందని తేలితే చాలు ఇక కాటికి పంపడానికి కావలసిన తంతును స్కానింగ్ కేంద్రంకు దానికి అనుబందంగా ఉన్న దవాఖానాలు కలిపి చేస్తున్నాయని ఇదంతా జిల్లాలో కామన్‌గా మారిందని ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని అమన్‌గల్, షాద్‌నగర్, శంషాబాద్, మొయినాబాద్, చెవెళ్ల, శంకర్‌పల్లి, ఇబ్రహింపట్నం, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, రాజేంద్రనగర్, గండిపేట్ తదితర మండలాల పరిధిలో అనుమతులు లేకుండా పలు స్కానింగ్ కేంద్రాలు, ఆసుపత్రులు నడుస్తు అధికారులకు కాసుల పంట పండిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కనీస అనుభవం లేని ఆర్‌యంపిలు స్కానింగ్‌కేంద్రాలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్న మన వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అంతా బావుంది అన్న బావంతో ముందుకు సాగడం వెనక ప్రతి నెల లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. డాక్టర్‌లు, ఆర్‌యంపిలు అబార్షన్‌లు చేయడానికి పోటి పడుతున్నట్లు వినికిడి. శివారులోని ఒక మండలంలో మహిళ ఆర్‌యంపి ఎకంగా తన ఇంటిలోనే అబార్షన్‌లు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. స్కానింగ్ కేంద్రాలు జనంను లూఠీ చేసే కేంద్రాలుగా మారాయని ఆర్‌ఎంపిలు, ఆసుపత్రులకు కాసులు కురిపిస్తు జనంను మాత్రం నిండా ముంచుతున్నాయని పలువురు మండిపడుతున్నారు.

అమలుకు నోచుకోని చట్టాలు….
ప్రభుత్వాలు లింగ నిర్దారణ పరీక్షలతో పాటు బ్రూణ హత్యలపై పట్టిష్టమైన చట్టాలను తీసుకువచ్చిన మామూళ్ల మత్తులో మునిగితేలుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పుణ్యమా రంగారెడ్డి జిల్లాలో చట్టాలు కొంత మందికి చుట్టాలుగానే మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా కార్యాలయాలకు, సమీక్ష సమావేశాలకు పరిమితం కావడం తప్ప క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం మూలంగానే జిల్లాలో అడ్డగోలుగా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు వెలుస్తు అడ్డగోలు దందాలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన వైద్యుడికి పది వేల జరిమానా, మూడు సంవత్సరాలు జైలు శిక్ష విదించే అవకాశం ఉన్న తనికీలు చేసి కేసులు నమోదు చేసేవారు లేకపోవడంతో అంతా డాక్టర్‌ల ఇష్టారాజ్యంగా మారింది.

జిల్లాలో లింగ నిర్దారణ పరీక్షలు యదేచ్చగా నిర్వహిస్తు గర్బంలో అమ్మాయి అని తెలితే అబార్షన్‌లు చేస్తుండటం మూలంగా 2011 లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకు 919 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారని తాజా లెక్కల ప్రకారం మరింత దిగజారినట్లు తెలుస్తుంది. జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం గ్రామీణ మండలాలతో పాటు నగర శివారులో అడ్డగోలుగా సాగుతున్న స్కానింగ్ కేంద్రాలతో పాటు ఆసుపత్రులపై తనికీలు నిర్వహిస్తే అక్రమాల జాతర బయటకు వస్తుంది.

Gender diagnostic tests contrary to norms