Home తాజా వార్తలు పరిషత్ ఎన్నికల కోసం సాధారణ పరిశీలకుల నియామకం

పరిషత్ ఎన్నికల కోసం సాధారణ పరిశీలకుల నియామకం

ZPTC and MPTC Electionsహైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులను నియామిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది.

స్వాతి లక్రా- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు
మహ్మద్ అబ్దుల్ నదీమ్- కుమురం భీం, మంచిర్యాల
శరవణన్- జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట
పౌసుమి బసు- కరీంనగర్, పెద్దపల్లి
శశిధర్‌రెడ్డి- భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
కె.వై.నాయక్- గద్వాల, వనపర్తి
శర్మన్- మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట
వాకాటి కరుణ- మెదక్, సంగారెడ్డి
చంపాలాల్- నల్లగొండ, సూర్యాపేట
సోనిబాలదేవి- యాదాద్రి భువనగిరి, మేడ్చల్
అభిలాశ్ బిస్త్- కామారెడ్డి, నిజామాబాద్
శ్రీలక్ష్మి- రంగారెడ్డి, వికారాబాద్
ఆకునూరి మురళి- భూపాలపల్లి, ములుగు, జనగాం
బి. శ్రీనివాస్- మహబూబాబాద్, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలు.

ఇదిలా ఉండగా జిల్లాకు ఒకరు చొప్పున 32 మంది వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. వ్యయ పరిశీలకులుగా జిల్లా ఆడిట్, సహాయక ఆడిట్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

General Observers for ZPTC and MPTC Elections