Home తాజా వార్తలు ‘గని’ ఆంథమ్ సాంగ్ విడుదల..

‘గని’ ఆంథమ్ సాంగ్ విడుదల..

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ‘గని’ ఆంథమ్ సాంగ్ లిరికల్ వీడియోను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టీ, నదియ, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘Ghani’ Anthem song lyrical video Released