మన తెలంగాణ/ హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతో పాటు వారంలో రెండు సార్లు పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు పేర్కొంది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న గజల్ శ్రీనివాస్ బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. అయితే ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి వస్తాననే నమ్మకం ఉందని చెప్పారు. ఇక అభిమానుల ఆశీర్వాదం కూడా నాపై ఉందన్నారు. ఇదే కేసులో రెండో ముద్దాయిగా ఉన్న పార్వతికి ముందస్తు బెయిల్ లభించింది. దీంతో ఆమె అరెస్టు నుంచి తప్పించుకున్నట్లైంది. ‘సేవ్ టెంపుల్స్’ అనే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రీనివాస్‌ను ఈ నెల 2న పోలీసులు అదుపులోకి తీసుకున్నది తెలిసిందే.
గజల్ శ్రీనివాస్‌కు షరతుల బెయిల్
- Advertisement -
- Advertisement -