Friday, April 19, 2024

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియకు నాంది

- Advertisement -
- Advertisement -

18 మంది నోడల్ ఆఫీసర్ల నియామకం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి ఎన్నికల పనులు ప్రారంభమైయ్యాయి. మంగళవారం నోడల్ అధికారుల నియామకంతో జిహెచ్‌ఎంసి కమిషనర్, ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారు. జిహెచ్‌ఎంసిలోని అదనపు కమిషనర్ల తో పాటు వివిధ విభాగాల అధిపతులను మొత్తం 21 విభాగాలకు గాను 18 మందిని నోడల్ అధికారులుగా నియమించా రు. అనంతరం కమిషనర్ వారితో సమావేశమైయ్యారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణతో పాటు మొత్తం పోలింగ్ ప్రక్రియలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈసందర్భంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేయాల్సిన ఏర్పాట్లపై వారికి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసే ఉత్తర్వులు, నిబంధనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సుచించారు. నోడల్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధులకు సంబంధిం చ తమ తమ పరిధిలో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఈ విడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు బాదావత్ సంతోష్, ప్రియాంక అలా, పి.ఎస్.రాహుల్ రాజ్, జయరాజ్ కెన్నెడి, డి.వి.కృష్ణ, జె.శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ మహ్మద్ జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

GHMC Election 2020 Works starts in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News