Home మెదక్ ప్రచార హోరు .. ప్రలోభాల జోరు

ప్రచార హోరు .. ప్రలోభాల జోరు

జిల్లాలోనే ప్రముఖుల ప్రచార సందడి
క్యాడర్‌కు అన్నీ అక్కడే..
ఓటర్ల కోసం ప్రలోభాల పర్వం షురూ…
మద్యం, చీరలు, ఆట సామగ్రి పెద్దఎత్తున సిద్ధం
GHMC5మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం తారా స్థాయికి చేరుకుంది. జిల్లాలో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్షంతో పెద్ద ఎత్తున బలాలు, బలగాలను మోహరించి ప్రచారం నిర్వహిస్తున్న అన్ని పార్టీల అగ్ర నాయకత్వం కీలక ఘట్టంపై గురిపెట్టింది. ఇప్పటివరకు ప్రచారంతో తమకు అనుకూల వాతావరణం తయారు చేసుకున్న నాయకులు ఇప్పుడు దానిని కాపాడుకుంటూ కావాల్సిన ఓట్లను అదనంగా సంపాధించుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. గ్రేటర్ మేయర్‌ను సాధించుకోవడంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాలో టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపిల అగ్ర నాయకత్వం పెద్ద ఎత్తున ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి. టిఆర్‌ఎస్ తరపున కెటిఆర్, కవితలతో పాటు ప్రతి నియోజకవర్గంలో మంత్రి, డివిజన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్‌చార్జీలుగా ఉంటూ ప్రచారాన్ని దుమ్మురేపుతున్నారు. టిడిపి పై మాటల తూటాలు పేల్చుతూ దూసుకుపోతున్నారు. టిడిపి తరపున జిల్లాలోని శివారు నియోజకవర్గాలు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, యల్‌బి,నగర్ రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పాటు అయన తనయుడు లోకేష్, రేవంత్‌రెడ్డితో పాటు అంధ్రా మంత్రులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులు జిల్లాలో ప్రచారంలో కాస్తా వెనకబడ్డారు. ప్రచారం కోసం పార్టీలు తమ క్యాడర్‌ను పూర్తిగా నమ్ముకున్నాయి. ఉదయం అల్పహారం నుంచి రాత్రి మందు వరకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుతూ, వారికి కావలసిన ఇతర అలవెన్సులు కూడా అందజేస్తున్నారు. దినసరి కూలీలను పెద్ద ఎత్తున ప్రచానికి వినియోగించుకుని వారికి రోజుకు ఐదు వందల వరకు కూలీ ఇచ్చి ఇతరత్రా అందజేస్తున్నారు.
ప్రలోభాల పర్వం షురూ…
గ్రేటర్ ఎన్నికలలో విజయమే లక్షంగా దూసుకుపోవడానికి చివరి ప్రయత్నాలు ప్రారంభించడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2న ఎన్నికలు ఉండటంతో నేడు, రేపటితో ప్రచార గడువు ముగియనుంది. ప్రచారంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలనీలలో ఓట్లు రాబట్టుకోవడానికి పెద్ద ఎత్తున నజరానాలతో పాటు మద్యం పంపిణీ కార్యక్రమంకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం నాడు జిల్లాలోని మల్కాజ్‌గిరిలో ఓ పార్టీ నాయకులు ఓటర్లకు టిఫిన్ బాక్స్‌లు పంపిణీ చేస్తుందని మరో వర్గం ఆరోపణలు చేయడంతో పాటు రేడ్‌హ్యండేడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో పార్టీలు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడంతో ఇతర పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల చివరి నిమిషం వరకు కావాల్సి న మద్యంను ఇప్పటికే రహస్య ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించారు. ప్రచారం ముగిసిన సమయం నుంచి మద్యం దుకాణాలు సైతం మూడ పడనుండటంతో అభ్యర్థులు తమకు కావాల్సిన కోటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చెస్తుండటంతో నగ రంలో మద్యం వ్యాపారులు పండగ చెసుకుంటున్నారు. కాలనీలలో యూత్ ఓట్లను పొందడానికి అటవస్తువులతో పాటు వ్యాయామ సామాగ్రి సైతం సరఫరా చేయడా నికి నేతలు రెడీ అవుతున్నారు. కొంత మంది అభ్యర్థులు నగరంలోని వివిధ ప్రాంతా ల్లో దుకాణాలతో అటవస్తువులు కొనుగోలు చేసి కాలనీలలో సంఘాలకు స్లీప్‌లను అందచేస్తున్నారు. స్లీపులను సదరు దుకాణంలో ఇచ్చి సరుకు తెచ్చుకోవలసి ఉంటుంది. కుల సంఘాలు, బస్తీ సంఘాలు తమ డిమాండ్‌ల చిట్టాను నేతలకు వివరించి వాటిని పొందడానికి రెడీ అవుతున్నారు. గ్రేటర్ ప్రచారంలో చివరి నాలుగు రోజులు నానా వింతలు బయటపడనున్నాయి.