Saturday, April 20, 2024

దోమల నియంత్రణకు డ్రోన్లు..

- Advertisement -
- Advertisement -

GHMC Office use drones for fight Mosquitoes

మన తెలంగాణ/సిటీ బ్యూరో: దోమల కట్టడికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని జిహెచ్‌ఎంసి సద్వినియోగం చేసుకుంటోంది. తద్వారా ప్రాణాంతక మైన డెంగీ లాంటి విష జర్వాల కారణమవుతున్న దోమల నియంత్రణలో సత్ఫాలితాలను సాధిస్తోంది. దోమలను నియంత్రించడానికి సాకేంతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ నగరవాసులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు బల్దియా ప్రత్యేక చొరవ చూపుతోంది.
దోమల నియంత్రణకు పూర్తిస్థాయి చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు చెరువులు, కుంటలతో పాటు మూసీ పరివాహక ప్రాంతం దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్న విషయం తెలిసిందే.. దీంతో నీటి నిలువ ప్రదేశాల్లో దోమల లార్వా నిర్వీర్యం చేసేందుకు జిహెచ్‌ఎంసి డ్రోన్లను విరివిరిగా వినియోగించుకుంటోంది. చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే సమస్యక పరిష్కారం కాదని గుర్తించిన జిహెచ్‌ఎంసి దోమల నియంత్రణకు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుంది. మనుషులకు ఇబ్బందులు కలిగించే మన్సోనియా, అర్మిజెరిస్, క్యూ లెక్స్ వంటి దోమలుసామూహిక సంతానోత్పత్తికి నీటి నిల్వ ప్రదేశాలు, వృక్ష సంపద, సేంద్రియ వ్యర్థాలు ఉన్న చెరువులు దోహదపడుతున్నాయి. దీంతో వీటిలో లార్వా దశలోనే దోమలను నియంత్రించేందుకు జిహెచ్‌ఎంసిలోని ఎంటమాలజి విభాగం ప్రత్యేక కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ వెక్టర్ బోర్న్ డీజీసెస్ కంట్రోల్ ఢిల్లీ నిర్ణయించిన మోతాదులో చెరవుల్లో ఫీల్డ్ వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు రసాయనాలను పిచికారి చేపట్టింది. అయితే పలు చెరువుల్లో గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం లేకపోవడం, దోమల నివారణకు పలు ప్రాంతాలు రసాయనాల పూర్తిస్థాయి పిచికారి చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఉండడంతో దీంతో దోమల పూర్తిస్థాయిలో నియంత్రించడం అసాధ్యంగా మారింది. దీంతో నిర్దేశించిన లక్షం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో దోమలను సమర్థవంతంగా నియంత్రించేందకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించించాలని నిర్ణయించిన జిహెచ్‌ఎం సి ఇందుకు డ్రోన్లను ఎంచుకుంది. ఇందులో భాగంగా మొదటి విడుతగా నగరంలోని 30 చెరువుల్లో డ్రోన్ల సహాయం దోమలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది.
డ్రోన్లతో సత్ఫాలితాలు
యాంటీ లార్వా ఆపరేషన్‌లో భాగంగా రసాయనాల పిచికారికి డ్రోన్ల వినియోగించడం ద్వారా ఎకరం విస్తీర్ణంలో ఉన్న చెరువులో కేవలం 10 నిమిషాల్లో పని పూర్తి అవుతుంది. అంతే కాకుండా చెరువులోని అన్ని భాగాలకు సులువుగా ఏకరీతిలో రసాయనాలను పిచికారి చేయడంతో దోమలను పూర్తిగా నియంత్రించడమే కాకుండా సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. దీంతో జిహెచ్‌ఎంసి పరిధిలోని 6 జోన్లు ఉండగా జోన్‌కు ఒక్కటి చోప్పున మొత్తం 6 హెక్సకాప్టర్ డ్రోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొదటి దశ కింద 30 చెరువులల్లో డ్రోన్ల సహాయంతో రసాయానాల పిచికారిని చేపట్టారు. అంతేకాకుండా దోమల సమస్య అధికంగా ఉన్న చెరువులు, కుంటలు, కాలనీలు, క్వారీలు, ఓపెన్ ప్లాట్లు, డంపింగ్ యార్డు, మూసీనది పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ల ద్వారా మరో 20 చెరువులో సైతంయాంటీ లార్వా ఆఫరేషన్ చేపట్టేందుకు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.

GHMC Office use drones for fight Mosquitoes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News