Thursday, March 28, 2024

నేడే గ్రేటర్ ఓట్ల లెక్కింపు

- Advertisement -
- Advertisement -

GHMC Polls Results 2020 on Dec 4 అభ్యర్థుల్లో ఉత్కంఠ… ఎవరి ధీమా వారిదే
 మొదట మెహిదీపట్నం…చివరగా మైలార్‌దేవ్‌పల్లి ఫలితం
 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
 మధ్యాహ్నం 3 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటిం గ్ ప్రారంభం కానుంది. గ్రేటర్ 150 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. అయితే ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులతోపాటు వాళ్ల ఏజెంట్లను మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
గ్రేటర్ ఎన్నికల్లో తక్కువగా ఓట్లు నమోదైన మెహిదీపట్నం వార్డు ఫలితం మొదట వెలువడనుండగా, అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి ఫలితం ఆలస్యంగా వెలువ డే అవకాశం ఉంది. మెహిదీపట్నం వార్డుకు కేవలం 11,818 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కించనుండగా, అంతకంటే తక్కువ ఓట్లున్న ఈ డివిజన్ ఫలితం త్వరగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లోని మెజార్టీ వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలైన నేపథ్యంలో రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. అత్యధికంగా 37,445ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశముంది. దీంతోపాటు సుభాష్‌నగర్ (33,191), గాజుల రామా రం (30,485), అల్లాపూర్ (30,485), బన్సీలాల్‌పేట (29,670), తార్నాక (29,490), సీతాఫల్‌మండి (29,443)ల్లో మూడు రౌండ్ల లెక్కింపు జరుగనుంది.
11 గంటల తర్వాత మొదటి రౌండ్ వివరాలు
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి రౌండ్ వివరాల వెల్లడి ఉదయం 11 గంటల తర్వాతనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో టేబుల్‌కు 1,000 ఓట్లు (40 బండిల్స్) లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం విజేతను ప్రకటిస్తారు. గుర్తు ఆధారంగా ఓట్ల ను ఒక్కో డబ్బాలో వేస్తారు. అనంతరం వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయన్నది తేలుస్తారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజ ర్, అసిస్టెంట్, అడిషనల్ కౌంటింగ్ సూపర్‌వైజర్లు ఉంటా రు. వార్డు రిటర్నింగ్ ఆఫీసర్ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. రిటర్నింగ్ అధికారి వద్ద అభ్యర్థితోపాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇతర ఏజెంట్లు పక్కన ఉండి లెక్కింపును పరిశీలించవచ్చు.
లెక్కింపు ఇలా…
వార్డుకు ఒకటి చొప్పున 150 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాలులో 14 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్‌గా కడతారు. ఇదే సమయంలో ఆ కేంద్రంలో పోలైన ఓట్లకు సమానంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తారు. ఒక కేంద్రంలో 610ఓట్లు పోలయ్యాయనుకుంటే, 25 చొప్పు న 24 బండిల్స్(600) కట్టిన అనంతరం 10 ఓట్లు మిగులుతాయి. వాటిని పక్కన పెడుతారు. ఇలా ప్రతి పోలింగ్ కేంద్రంలో 25చొప్పున బండిల్స్ కట్టిన అనంతరం.. మిగి లే ఓట్ల (25లోపు ఉంటే)ను ఓ ట్రేలో వేసి, తర్వాత వాటి ని బండిల్స్‌గా కడతారు. వార్డు పరిధిలోని అన్ని ఓట్లను బండిళ్లుగా కట్టిన అనంతరం.. ఒక డ్రమ్ములో వేసి కలుపుతారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలు తెలియకూడదనే ఇలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి రెండున్నర గంటలు పట్టే అవకాశముంది.
మొబైల్ ఫోన్లను నో పర్మిషన్
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ హాలులో మొబైల్ ఫోన్‌లకు అనుమతి ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి కౌంటింగ్ టేంటింగ్ ఒకరి చొప్పున కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవచ్చని తెలిపింది. ఉదయం 8గంట ల కౌంటింగ్ ప్రారంభం కానుండగా, కౌంటింగ్ ప్రారం భం కంటే ఒక గంట ముందుగానే కౌంటింగ్ ఏజెంట్లు హాల్ వద్దకు చేరుకోవాలని పేర్కొంది. అభ్యర్ధులు, వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 7.45 గంటలకు స్ట్రాంగ్ రూం తెరవబడుతుందని తెలిపింది. కౌంటింగ్ హాలులోపల ఉన్న ప్రతి వ్యక్తి, చట్టపరంగా ఓటింగు రహస్యాన్ని కాపాడి అందుకు సహకరించాలని పేర్కొంది. ఓటింగ్ రహస్యాన్ని ఉల్లంఘించి, ఎవరు కూడా ఏ సమాచారాన్ని ఇతరులకు అందించకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారు జిహెచ్‌ఎంసి చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని ఎస్‌ఇసి వెల్లడించింది. ఓట్ల లెక్కింపు రెండు దశలలో జరుగుతుందని, మొదటగా పోలింగ్ కేంద్రాల వారీగా ప్రాథమిక లెక్కింపు జరుగుతుందని, తర్వాత వివరణాత్మక లెక్కింపు జరుగుతుందని పేర్కొంది. ప్రాథమిక లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల లోపు, వివరణాత్మక లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలలోపు (ఎక్కువ ఓటర్లు ఉన్న వార్డులు మినహా) పూర్తి అయ్యే విధముగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
టెండర్ ఓట్ల కవర్లను తెరవకుండా భద్రపరుస్తారు
ఎన్నికల కౌంటింగ్ జరుగునప్పుడు ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యాలట్ బాక్సులో ఉన్న బ్యాలెట్ పేపర్లను మాత్రమే కౌంటింగ్‌కు పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారని, టెండర్ ఓట్లను లెక్కించరని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏదైనా పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటు నమోదైనప్పుడు ఆ పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారి ఆ టెండర్ ఓటు నమోదైన బ్యాలెట్ పేపరును బ్యాలెట్ బాక్సులో వేయకుండా దానికి ప్రత్యేకంగా కేటాయించిన కవర్‌లో ఉంచి సీలు చేసి, రిసెప్షన్ సెంటర్‌లో రిటర్నింగ్ అధికారికి అందజేస్తారని తెలిపింది. ఈ టెండర్ బ్యాలెట్ ఉన్న కవర్‌లను ఎన్నికల చట్టబద్ధమైన కవర్‌లతో సహా ప్రత్యేకంగా భద్రపరుస్తారని, ఆ కవర్లను ఎట్టి పరిస్టితుల్లోను రిటర్నింగ్ అధికారి తెరవరాదని పేర్కొంది.

GHMC Polls Results 2020 on Dec 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News