Tuesday, June 18, 2024

సిఎఎకి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి తీర్మానం

- Advertisement -
- Advertisement -

GHMC

 

ఏకగ్రీవంగా ఆమోదించిన సర్వసభ్య సమావేశం

మన తెలంగాణ /సిటీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సిఎఎ వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జిహెచ్‌ఎంసి సైతం తీర్మానాన్ని ఆమోదించి మద్దతును తెలియజేసింది. సిఎఎకు వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి డిప్యూటి మేయర్ బాబా ఫషియుద్దీన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, ఎంఐఎం సభ్యులు మాజిద్ హూస్సెన్, టిఆర్‌ఎస్ సభ్యులు జగదీశ్వర్‌లు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… బల్దియా తీర్మానం ఆమోదం వల్ల రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్న వారికి కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా అన్యాయం జరిగే ఏ అంశాన్ని అయినా తెలంగాణ ప్రజలు ప్రతిఘటిస్తారని ఈ తీర్మానం ద్వారా యావత్తు దేశ ప్రజలకు తెలియ జెప్పినట్లు అయిందన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ… సెక్యులరిజానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిలువుట్టద్దమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సిఎఎకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సైతం తీర్మానం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని బల్దియాలో సైతం ఈ తీర్మానాన్ని ప్రతపాదించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

GHMC Resolution Against CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News