Home జోగులాంబ గద్వాల్ విద్యావాలంటీర్ల రెన్యువల్ పట్ల హర్షం…

విద్యావాలంటీర్ల రెన్యువల్ పట్ల హర్షం…

 Vidya Volunteers

 

గద్వాల : విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేస్తూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ఒ విడుదల చేయడం పట్ల బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా విద్యావలంటీర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం విద్యావాలంటీర్లను ప్రస్తుత విద్యా సంవత్సారానికి రెన్యూవల్ చేయడం జరిగిందన్నారు. విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేయడంతో సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో విద్యావాలంటీర్లు చంద్ర, మోహన్, నర్సింహులు, సిద్దప్ప, ఆంజనేయులు , పరుషరాముడు తదితరులు పాల్గొన్నారు.

GHovernment orders to Renewal of Vidya Volunteers