Home టెక్ ట్రెండ్స్ జియోనీ ఎఫ్9 ప్లస్ నయా స్మార్ట్‌ఫోన్…

జియోనీ ఎఫ్9 ప్లస్ నయా స్మార్ట్‌ఫోన్…

Gionee F9 plus

 

జియోనీ సరికొత్త తన స్మార్ట్ ఫోన్ ను ఎఫ్9 ప్లస్ పేరుతో ఈ రోజు భారత్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 7690ల ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.26 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13,2 మెగాపిక్స‌ల్ రెండు కెమెరాలు, ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 3 జిబి ర్యామ్‌, 32 జిబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ని కలిగి ఉంది.

జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు… 

6.26 ఇంచుల డిస్‌ప్లే, 1.65 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయ‌ల్ సిమ్‌, వెనక భాగంలో 13,2 మెగాపిక్స‌ల్ రెండు కెమెరాలు, ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్టిఈ, 4050 ఎంఎహెచ్ బ్యాట‌రీ, బ్లూటూత్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ కేవలం రూ.7690 లకే వినియోగదారులకు లభించనుంది.

Gionee F9 plus smartphone Released