Home జాతీయ వార్తలు వడదెబ్బతో బాలిక మృతి

వడదెబ్బతో బాలిక మృతి

BREAKINGబీద్ : మహారాష్ట్రలో నీటి ఎద్దడి తీవ్రంగా నెలకొంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరో పక్క నీటి చుక్క లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. మహారాష్ట్రలో కరవు ప్రాంతాల్లో ఒకటైన బీద్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. బీద్‌కు చెందిన యోగిత అశోక్ దేశాయ్ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.ఈ క్రమంలో తల్లిదండ్రులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో యోగిత సమీపంలోని చేతిపుంపు వద్దకు నీళ్ల కోసం వెళ్లింది. వడదెబ్బ తగిలి చేతి పంపు వద్ద స్పృహ తప్పిపడిపోయింది. విషయాన్ని గమనించిన స్థానికులు యోగితను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యోగిత మృతి చెందిందని వైద్యులు తెలిపారు.