Thursday, April 18, 2024

ప్రియుడి ఇంటిపై ప్రియురాలు బంధువుల దాడి… ప్రియుడి తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

Girl farmily members attack lover house in Nalgonda

 

నల్లగొండ: ప్రేమజంట లేచిపోవడంతో ప్రియుడి ఇంటిపై ప్రియురాలు బంధువుల దాడి చేయడంతో ప్రియుడి తండ్రి అకస్మాత్తుగా చనిపోయిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  వింజమూరి మహేందర్(43), కలకొండ దేవదానం(45) వర్కాల గ్రామంలో నివసిస్తున్నారు. దేవదానం కుమారుడు శ్రీకాంత్, మహేందర్ కుమార్తె అఖిల గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ ప్రేమ జంట ఇంట్లో చెప్పకుండా ఏప్రిల్ 19న ఇంటి నుంచి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లారు. మహేందర్ తన కూతరు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వర్కాల గ్రామంలో పంచాయతీ పెట్టడంతో ప్రేమ జంటను పిలించేందుకు అంగీకరించారు. బుధవారం తెల్లవారుజామున మహేందర్ తన బంధువులతో దేవదానం ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన దేవదానం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి ఎస్ఐలు తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News