Thursday, March 28, 2024

12 ఏళ్ల బాలిక…. వలసకూలీల ప్రయాణానికి రూ.48 వేలు

- Advertisement -
- Advertisement -

Girl pays Rs 48000 airfare for Migrants

లక్నో: ఎనిమిదో తరగతి విద్యార్థిని తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 48 వేల రూపాయలను వలసకూలీల ప్రయాణానికి ఖర్చు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన నిహారిక ద్వివేదీ (12) అనే అమ్మాయి లాక్ డైన్ నేపథ్యంలో వలస కూలీల కష్టాలు కళ్లారా చూసి ఆమె గుండె కరిగిపోయింది. వెంటనే తాను దాచుకున్న 48 వేల రూపాయలను ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు వలసకూలీల విమాన ప్రయాణానికి ఖర్చు చేసింది. ముగ్గురు వలస కూలీల్లో ఒక అతడికి క్యాన్సర్ వ్యాధి ఉంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆ బాలిక సహాయం గొప్పదని ప్రశంసించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని ఆమె దయగల హృదయానికి సిఎం కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ విధించడంతో అక్షయ్ కోతావాలే అనే వ్యక్తి  పెళ్లి వాయిదా పడింది. పెళ్లి ఖర్చు కోసం ఉంచుకున్న రెండు లక్షల రూపాయలను వృద్ధులకు, గర్భిణీలకు సహాయం చేశాడు. లక్నోలోని చార్భాగ్ రైల్వే స్టేషన్‌లో 80 ఏళ్ల వృద్ధుడు వలసకూలీలకు ఆహారం అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News