Home జాతీయ వార్తలు అత్యాచారం…. బాధితురాలిపై పెట్రోల్ పోసి…

అత్యాచారం…. బాధితురాలిపై పెట్రోల్ పోసి…

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా బండా ప్రాంతంలో ఉన్నావో లాంటి మరో ఘటన చోటుచేసుకుంది. రేప్ బాధితురాలపై నిందితుడు పెట్రోల్ పోసి తగటబెట్టాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  హుస్సేన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో అమ్మాయిపై దగ్గరి బంధువే అత్యాచారం చేశాడు. దీంతో కులపెద్దలు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిందితుడికి తెలపడంతో ఒప్పుకున్నాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బాధితురాలు ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆరుపులు కేకలు ఇంట్లో నుంచి రావడంతో స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  90 శాతం గాయపడడంతో  ఆమె పరిస్థితి విషమంగా ఉందని కాన్పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉన్నావో బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా ఐదుగురు దుండగులు పెట్రోల్ పోసి తగటబెట్టిన విషయం తెలిసింది. ఐదుగురిలో ఇద్దరు నిందితులు ఉన్నారు. ఉన్నావో బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోయిన విషయం విధితమే.  

 
Girl raped, set ablaze by relative in Fatehpur Dist, On hearing her cries, neighbours rushed her to a local community health centre

 

Girl raped, set ablaze by relative in Fatehpur Dist