Saturday, April 20, 2024

బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి చేయలేదని అమ్మాయి ఆత్మహత్య…. లవర్‌ను నరికి….

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ఓ అమ్మాయి తన లవర్‌తో కుటుంబ సభ్యులు పెళ్లి చేయడంలేదని ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె బంధువులు లవర్‌ని హత్య చేసిన సంఘటన తమిళనాడులోని కొట్టకుప్పమ్ జిల్లా విల్లుపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అరుణ (20) అనే అమ్మాయి రాఘవన్‌ను ప్రేమించింది. వాళ్ల ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో ఆమెకు మరో వ్యక్తి పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాఘవన్ హైదరాబాద్‌లో ఓ క్వారీలో పని చేస్తున్నాడు. అరుణ ఆత్మహత్య చేసుకుందని తెలియగానే అతడు తన మణికట్టును కోసుకున్నాడు. అరుణ మామ పద్మనాభం రాఘవన్‌ను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రాఘవన్‌ను మర్డర్ చేయడానికి రాఘవన్ స్నేహితుడు సంజయ్ సహాయం తీసుకున్నారు. పద్మనాభం తన సోదరుడు అరుణ్ కుమార్, సోదరులు కుమారులు ప్రవీణ్, రంజిత్ కుమార్, మరో నలుగురితో కలిసి రాఘవన్ చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ వెంటబెట్టుకొని ఆరుగురు ద్విచక్రవాహనాలపై పెర్యికొట్టకుప్పమ్‌కు చేరుకున్నారు. వెంటనే రాఘవన్, అతడి స్నేహితుడు శివనేసన్‌పై పద్మనాభం గ్యాంగ్ దాడి చేసింది. అనంతరం శివనేషన్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్నాడు. రాఘవన్‌ను కొట్టమేడులోని దేవాలయం వెనకకు తీసుకెళ్లి అతడిని పద్మనాభమ్ గ్యాంగ్ నరికి చంపారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. శివనేసన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అసలు నిందితుడు పద్మనాభం పరారీలో ఉన్నాడు.

 

Girl Suicide without Marry Lover, Kin Murder Lover,Girl Kins Murder her Lover Raghavan aftear Aruna Committ suicide but Lover dead body Burned

 

Girl Suicide without Marry Lover, Kin Murder Lover
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News