Home ఆఫ్ బీట్ పెళ్లి నిర్ణయం అమ్మాయిలదే…!

పెళ్లి నిర్ణయం అమ్మాయిలదే…!

Girls

 

జీవిత భాగస్వామి విషయంలో ఆడపిల్లల నిర్ణయమే ముఖ్యంగా ఉంటుందని, వాళ్ళే నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్లను ఒప్పించి వాళ్ళ అంగీకారంతోనే చేసుకొంటున్న పెళ్ళిళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. మారుతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థపైన జరిగిన ఒక సర్వేలో పెద్దలు చూసిన సంబంధాలలోంచి తమకు సరైన జోడిని ఆడపిల్లలు ఎంపిక చేసుకొంటున్నారని, పట్టణ ప్రాంతాలలోనే ఇలాంటి మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆడపిల్లలు చాలా శ్రద్ధగా తమ ఊహలకు, అంచనాలకు తగిన వరుడిని స్వయంగా ఎంచుకొంటున్నారు. అదీ ముఖ్యంగా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలకే సరే అనటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.

Girls are Making Marriage Decision