Friday, April 19, 2024

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

- Advertisement -
- Advertisement -

ప్రథమ సంవత్సరంలో 61.68 శాతం పాస్
సెకండియర్ లో 63.49 శాతం ఉత్తీర్ణత
గురుకుల కాలేజీల్లో 92 శాతం మంది విద్యార్థుల పాస్
గతేడాదికన్నా ఈసంవత్సరం తగ్గిన ఉత్తీర్ణత శాతం
మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్
జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులు వెయిటేజీ తొలగింపు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో మొత్తంగా 61.68 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, సెకండియర్ లో 63.49 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసంవత్సరం గతేడాదికన్నా ఉత్తీర్ణత తగ్గింది. రాష్ట్రంలో ఈఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం 4,33,082 మంది, హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ సాధించారు.

Also Read: పసుపు బోర్డు పేరుతో కర్ణాటక ఎన్నికల్లో బిజెపి మోసం: మంత్రి వేముల

మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్ది దశలో ఇంటర్ అనేది కీలకమైంది. జీవితానికి టర్నింగ్ పాయింట్‌ని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఫస్టియర్, సెకండియర్ 9,45,153 మంది హాజరయ్యారని తెలిపారు. 1473 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించమన్నారు. ఈపరీక్షల నిర్వహణకు 26వేల మంది సిబ్బంది సేవలందించినట్లు చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్ని విభాగాల అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో అత్యధికంగా 92 శాతం ఉత్తీర్ణత సాధించాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో 62 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో 54 శాతం ఉత్తీర్ణత వచ్చిందన్నారు.

Also Read: స్నేహపూర్వకమే తప్ప.. పొత్తుల ప్రస్తావన రాలేదు

వచ్చే ఏడాది గురుకుల కాలేజీలతో పోటీపడి ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు మంత్రి సూచించారు. ఒకటో రెండో సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వారిని దగ్గరకు తీసుకుని కౌన్సెలింగ్ ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల 4 నుంచి ఇంటర్ అడ్వాడ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఫెయిలైన సబ్జెక్టులకు సంబంధించి మళ్లీ పరీక్ష రాసి పాసయ్యేందుకు అవకాశం ఉందని, మీ స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్లేందుకు మరో అవకాశం ఉందని విద్యార్థులకు సూచించారు.

Also Read: సిఎం ముఖ్య సలహాదారుడిగా సోమేశ్ కుమార్

ప్రథమ సంవత్సరం ఫలితాలో 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 75 శాతంతో మేడ్చల్ మొదటిస్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాలో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 85 శాతంతో మొదటిస్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ఫస్టియర్, సెకండియర్ రెండు ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్ 2 శాతం తగ్గగా, సెకండియర్ 1 శాతం ఫలితాలు తగ్గాయి.

Also Read: బొద్దల గడ్డ కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్: తలసాని

ప్రభుత్వం కళాశాల్లో 54 శాతం, గురుకుల జూనియర్ కళాశాల్లో 92 శాతం, సోషల్ వెల్పేర్ కాలేజీలో 89శాతం, బిసి వెల్పేర్ కళాశాల్లో 87శాతం, మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో 66 శాతం, కెజీబివి జూనియర్ కళాశాల్లో 77 శాతం,గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల్లో 84 శాతం ,టిఎంఆర్‌జేసీ జూనియర్ కాలేజీల్లో 83శాతం, ప్రైవేటు ఎయిడ్‌డ్ జూనియర్ కళాశాల్లో 46 శాతం , సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 72 శాతం ప్రైవేటు ఆన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాల్లో 63 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Also Read: బిజెపి పైసా ఇవ్వలే: మంత్రి కెటిఆర్

గ్రూపు వారిగా ఫలితాలు ః ప్రథమ సంవత్సరం ఎంపిసిలో 75.94శాతం, బైపిసి 64.14 శాతం , సిఈసీ 37.98 శాతం, హెచ్‌ఈసీ 30.18 శాతం, ఎంఈసీ 60.84 శాతం, ద్వితీయ సంవత్సరంలో ఎంపిసిలో 72.73 శాతం, బైపిసిలో 67.44శాతం,, సీఈసీ 47.25శాతం, హెచ్‌ఈసీ 46.69శాతం, ఎంఈసీ 59.97 శాతం విద్యార్థులు పాసైయ్యారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో టాపర్లు: ప్రథమ సంవత్సరంలో కళ్లా సందేష్(హెచ్‌ఈసీ) 487, రెండవ స్థానంలో శాన్య(సీఈసీ) 481 మార్కులు, తృతీయ స్థానం మీసా మహావీణ్(సీఈసీ) 479 మార్కులు సాధించారు. అదే విధంగా వృతి విద్యాకోర్సులో కానూరి రాజ్యలక్ష్మి(సిజిఏ) 496, ఆకుల శీరిష(ఎంపిహెచ్‌డబ్లూ) 495, తుపాకుల శ్యాంసుందర్ 495మార్కులతో ముందు వరుసలో నిలిచారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో… ఎస్.వి. వైష్ణవి దేవి(ఎంపిసి) 991, జవేరియా ఫిర్దోస్ నాబా (ఎంపిసి) 990, తప్పెట రోహిణి (బైపిసి) 990 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలలను ఉత్తమ స్థానంలో నిలిపారు. వృతి విద్యాకోర్సులో టేకు రంజిత 989, బి. అనూష 989, కె. సంద్యా 989 మార్కులు సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News