Friday, March 29, 2024

కొత్త బాహ్యగ్రహం జీజే 367 బి

- Advertisement -
- Advertisement -

అక్కడ ఏడాదంటే 8 గంటలే

GJ 367 B planet found in space

కీల్ (యూకె) : జీజే 367 బీ అనే కొత్త బాహ్యగ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు కనిపెట్టిన 5000 బాహ్య వలయ గ్రహాల్లో ఇది తేలికైంది. సౌర కుటుంబాలకు అవతల ఉండే గ్రహాలను బాహ్యవలయ గ్రహాలని పిలుస్తారు. ఇవి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయి. సాధారణంగా సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి 365 రోజులు పడుతుంది. కొత్తగా కనిపెట్టిన ఈ గ్రహం మాత్రం తన మాతృనక్షత్రం చుట్టూ 8 గంటల్లోనే పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ లెక్కన అక్కడ సంవత్సరమంటే మనకు 8 గంటలతో సమానం. అంగారకుడి కంటే ఇది కాస్త పెద్దది. ఇక్కడ ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వాతావరణంలో కఠినమైన లోహాలు కూడా ఇట్టే కరిగిపోతాయి. భూమి నుంచి 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ గ్రహాన్ని క్రిస్టిన్ లామ్ నేతృత్వం లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానెటరీ రీసెర్చి సెంటర్‌కు చెందిన 72 మంది శాస్త్రవేత్తల బృందం కనుగొంది. వీరి పరిశోధన పత్రాన్ని జర్నల్ సైన్స్ ప్రచురించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News