Thursday, April 25, 2024

ప్రపంచంలో @20 మిలియన్ల కరోనా నిర్ధారణ కేసులు..

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో 20 మిలియన్లకు చేరుకున్న కరోనా నిర్ధారణ కేసులు
ఆరు వారాల్లోనే అమాంతంగా రెట్టింపు సంఖ్య
ఇందులో సగం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలవే: జాన్స్‌హోప్‌కిన్స్ యూనివర్శిటీ సమీక్ష

Global Covid-19 Cases Cross 20 Million Mark

మిటో(జపాన్): ప్రపంచం మొత్తం మీద కరోనా నిర్ధారణ కేసులు మంగళవారం నాటికి 20 మిలియన్ల (రెండు కోట్లు)కు చేరుకున్నాయి. వీటిలో సగం కన్నా ఎక్కువ అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల నుంచే ఉన్నాయి. జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్శిటీ గణాంకాల కన్నా కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధితుల్లో 40 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడం గమనార్హం. చైనాలో గత ఏడాది ఈ వైరస్ మొదట బయటపడిన నాటి నుంచి 10 మిలియన్ కేసులు వరకు పెరగడానికి ఆరు నెలలు పట్టగా, ఈ సంఖ్య రెట్టింపు కాడానికి కేవలం ఆరు వారాలే పట్టడం గమనించ వలసి ఉంది. జులై 22 నాటికి ప్రపంచం మొత్తం మీద 15 మిలియన్ కేసుల వరకు పెరగ్గా, వీటిలో రెండింట మూడొంతుల కేసులు అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలవే అని ఆగస్టు 9న ఒక ఎపి డేటా వెల్లడించింది. భారత్‌లో రోజువారీ తాజా కేసులు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడు రోజుల సరాసరి 58,768 వరకు నమోదు కాగా, అదే అమెరికాలో మొత్తం కేసులు ఐదు మిలియన్ వరకు చేరుకున్నాయి. ఈ కేసుల సరాసరి సంఖ్య మాత్రం జులై 22 నుంచి తగ్గింది. అయితే ఒకేఒక్క రోజులో కొత్త కేసులు 53,813 వరకు నమోదు కావడం విశేషం. 45 రోజుల్లోనే ప్రపంచం మొత్తం మీద కరోనా కేసులు 20 మిలియన్ వరకు రెట్టింపు అయ్యాయి.
పెరుగుతున్న మరణాలు.. అమెరికాలోనే అత్యధికం
జాన్‌హోప్‌కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం కరోనా వైరస్ మరణాలు 4,99,506 నుంచి 7,36,191కు పెరిగాయి. కొత్తగా సంభవించిన మొత్తం 2,36,685 మరణాలను పరిశీలిస్తే రోజుకు సరాసరిన 5200 కన్నా ఎక్కువగా మరణాలు సంభవించినట్టు తేలుతోంది. ఈ మరణాల్లో ఐదోవంతు లేదా 1,63,000 కన్నా ఎక్కువ మరణాలు అమెరికా లోనే ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా జరిగాయి. ఇండోనేసియా, జపాన్ తదితర దేశాల్లో కూడా కేసుల భారం చాలా వేగంగా పెరుగుతోంది. బ్రెజిల్‌కు చెందిన జెయిర్ బొల్సొనారో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరి మెక్సికోలో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుల్ లోపెజ్ ఒబ్రాడర్ మాస్క్‌లు తప్పనిసరిగా కాకుండా అరుదుగా ధరించడం, లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలన్న హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం జరిగింది. ఫలితంగా మెక్సికోలో ఐదు లక్షల వరకు కేసులు నమోదై, 50,300 వరకు మరణాలు సంభవించాయి. ఇప్పుడు మెక్సికో ఈ కరోనా మహమ్మారిని ఎలా నియంత్రించాలో తెలియక సతమతమౌతోంది. సగం మంది జనాభా ఎలాంటి పనులు లేక, ఎలాంటి ప్రయోజనాలు పొందక, నిరుద్యోగ బీమా లేక అల్లాడుతున్నారు. పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తే ప్రజలకు ఎలాంటి సంపాదన లేక, రోజువారీ ఆదాయం పొందలేక ఇబ్బందులు పడవలసి వస్తుందని హెల్తు సెక్రటరీ హ్యూగోలోపెజ్ ఆందోలన వెలిబుచ్చారు. మెక్సికోలో ఊబకాయం, డయాబెటిస్ రోగులు ఎక్కువ. ఈ మరణాలు కూడా ఎక్కువే. దీనికి తోడు కరోనా పరీక్షలు కూడా తక్కువగానే జరుగుతున్నాయి. ఇంతవరకు జరిగిన పరీక్షల్లో 47 శాతం పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
జపాన్‌లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
జపాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే పాజిటివ్ రేటు స్థిరమైన 7 శాతంగా ఉంది. ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఈ ఏడాదంతా సమ్మర్ హాలిడేస్ గా పరిగణించాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఐరోపాలో బ్రిటన్, స్పెయిన్‌లో కేసులు పెరుగుతున్నాయి. ఆసియాలోని వియత్నాంలో ఇప్పటివరకు కరోనా మరణాలు ఏవీ నమోదు కాక పోయినా తాజాగా సముద్ర తీరంలోని డేనాంగ్ పట్టణంలో కొన్ని కేసులు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో గత వంద రోజుల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి చెందుతున్న ఉదంతాలు ఏవీ లేనందున పొరుగునున్న న్యూజిలాండ్‌తో ప్రయాణాలను పునరుద్ధ రించుకునే ప్రయత్నంలో ఉంది. మెల్‌బోర్న్ లోను పరిసరాల్లోను తాజాగా కొన్ని కేసులు బయటపడ్డాయి. మెల్‌బోర్నెతోసహా విక్టోరియాలో తాజాగా 331 కేసులు బయటపడగా, మరో 19 మంది మృతి చెందారు.
చైనా,హాంకాంగ్‌లో తగ్గుతున్న కేసులు
చైనా, హాంకాంగ్‌ల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. చైనాలో జింజియాంగ్ ప్రాంతంలో తాజా కేసుల సంఖ్య 13కు తగ్గగా, హాంకాంగ్‌లో తాజాగా 69 కేసులు నమోదయ్యాయి. చాలా ఆసియా దేశాల మాదిరిగా చైనా కొత్తగా దేశానికి వచ్చిన వారికి పరీక్షలను మరింత ముమ్మరంగా చేయడమే కాకుండా, రెండు వారాల పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. విదేశీయులు రాకుండా నిషేధిస్తోంది. సరిహద్దుల మూసివేత, మాస్క్‌లు , లాక్‌డౌన్లు, కేసుల డేటా ఇవన్నీ ప్రపంచంలో కొత్త జీవిత భాగాలయ్యాయి. అమెరికాలో మాదిరిగా రాజకీయాల రగడ రగిలించే అంశాలు ప్రపంచంలో కనిపించడం లేదు.
అమెరికాలో ప్రజారోగ్య వైఫల్య విపరీతం
అమెరికాలో కరోనా మహమ్మారిని నియంత్రించలేక ప్రజారోగ్య నిపుణుల పైన, సంస్థల పైన ఉన్నతస్థాయి నేతలే విమర్శల దాడికి దిగుతున్నారు. ఇందులో ట్రంప్ కూడా తీసిపోలేదు. అమెరికాలో ప్రజారోగ్యం విపరీతంగాతయారైంది. ఇది ప్రజాందోళనలకు దారి తీస్తోంది. ఈ పరిణామాల కారణంగా ఏప్రిల్ నుంచి 23 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి, స్థానిక ఆరోగ్యనేతలు దాదాపు 49 మంది రాజీనామా లేదా రిటైర్డు కావలసి వచ్చిందని, కైసర్ హెల్తు న్యూస్ సర్వీస్ అసోసియేటెడ్ ప్రెస్ తమ సమీక్షలో వెల్లడించాయి.

Global Covid-19 Cases Cross 20 Million Mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News