Home జాతీయ వార్తలు కరోనా కారణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ : ప్రధాని మోడీ

కరోనా కారణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ : ప్రధాని మోడీ

Global Economy Damaged by Corona: PM Modiన్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శనివారం ఉదయం పండిట్ దీన్‌ద‌యాల్ పెట్రోలియం యూనివ‌ర్సిటీలో 45 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంగ‌ల మోనోక్రిస్ట‌లైన్ సోలార్ ఫొటో వోల్టాయిక్ పానెల్ ప్లాంటును వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. అనంత‌రం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే పెట్రోలియం యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ ఇంధన రంగంలో పలు మార్పులు జరిగాయని, ఇప్పుడు పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో రాణించాలని ఆయన సూచించారు.