Home తాజా వార్తలు విదేశీ పెట్టుబడుల కేంద్రంగా భారత్

విదేశీ పెట్టుబడుల కేంద్రంగా భారత్

US INDIA

 

ఉద్దీపన చర్యలను సాగతించిన అమెరికా వాణిజ్య వర్గాలు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ తీసుకున్న ఉద్దీపన చర్యలను అమెరికా వ్యాపార వర్గాలు స్వాగతించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించిన పలు ఉద్దీపన కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం మెండుగా ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ చర్యలతో భారత్ అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా కొనసాగనుందని తెలిపాయి.‘ నిర్మలా సీతారామన్, భారత ప్రభుత్వం తీసుకున్న పలు ఉద్దీపన చర్యలను మేం స్వాగతిస్తున్నాం. దీనిద్వారా వృద్ధి రేటు గాడిన పడి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది’ అని యుఎస్ ఇండియా వాణిజ్య మండలి అధ్యక్షురాలు నిశా దేశాయ్ బిశ్వాల్ అభిప్రాయపడ్డారు.

ఈ చర్యలతో విదేశీ మదుపర్లను సానుకూల సంకేతాలు పంపారన్నారు. దీంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రకటించిన పలు అంశాలను గుర్తు చేశారు. కాగా, భారత ప్రభుత్వం తీసుకున్ననిర్మాణాత్మక చర్యలు సులభతర వాణిజ్యానికి దోహదపడతాయని బారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యుఎస్‌ఐఎస్‌పిఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్‌తో కలిసి పని చేయడానికి యుఎస్‌ఐఎస్‌పిఎఫ్‌కు మెరుగైన అవకాశాలు ఉంటాయని పేర్కొంది.

Global growth weak but India still fastest growing economy