Home తాజా వార్తలు భారత్‌లో అన్ని ప్రాంతాలు మా టార్గెట్…

భారత్‌లో అన్ని ప్రాంతాలు మా టార్గెట్…

Syed-Salahuddin

ఇస్లామాబాద్: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అగ్రరాజ్యం అమెరికా పర్యటన నేపథ్యంలో హిజుబుల్ ముజాహిదీన్ చీఫ్ సలాహుద్దీన్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా అగ్రరాజ్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సలాహుద్దీన్ ఓ పాక్ టివి ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. దీనిలో ఆయన మాట్లాడుతూ… భారత్‌లో ఉగ్రవాద కార్యకలపాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. భారత భద్రతా దళాలే లక్షంగా ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. కశ్మీరే తన ఇల్లు అని సలాహుద్దీన్ పేర్కొన్నారు. తనకు భారత్‌లో అనేకమంది మద్దతుదారులు ఉన్నారన్నారు. భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడినప్పటికీ 9/11 దాడుల తర్వాత ప్రపంచ దృక్పథం మారిందన్నారు. చివరగా భారత్‌లో తమకు అన్ని ప్రాంతాలు లక్షంగా ఉన్నట్టు తెలిపారు.