Thursday, March 28, 2024

50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి విమానం టేకాఫ్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : విమాన సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ… బెంగళూరు విమానాశ్రయంలో మరో ఘటన ప్రయాణికులను గగ్గోలు పెట్టించింది. సోమవారం ఉదయం ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్‌వేస్ విమానం జి8 116 ఏకంగా 50 మందికి పైగా ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ తీసుకుంది. దీంతో విమానాశ్రయం లోనే ఉండిపోయిన మిగతా ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

విమానయాన సంస్థ నిర్లక్షాన్ని ఎండగట్టారు. ఈమేరకు విమానయాన సంస్థతోపాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా,ప్రధాని కార్యాలయానికి టాగ్ చేస్తూ ఫిర్యాదులు చేశారు. కొంతమంది ట్వీట్‌లకు స్పందించిన గో ఫస్ట్ సంస్థ ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్టు సమాధానం ఇచ్చింది. సంబంధిత ప్రయాణికుల వివరాలను కోరింది. గోఫస్ట్ సంస్థతో ఇది అత్యంత భయానక అనుభవమని శ్రేయా సిన్హా అనే ప్రయాణికురాలు ఆవేదన వెలిబుచ్చారు. “ఉదయం 6.20 కు విమానం ఉండగా, 50 మందికి పైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారు. అయితే గంటపాటు అందులోనే ఉంచారు. నిర్లక్షానికి ఇది పరాకాష్ఠ” అని ట్విటర్ వేదికగా విమర్శించారు.

సతీశ్ కుమార్ అనే వ్యక్తి టికెట్ ఫొటోలు షేర్ చేస్తూ కేవలం ఒక బస్సులోని ప్రయాణికులే విమానం ఎక్కారని, మరో బస్సు లోని వారంతా ఇక్కడే ఉండిపోయారని తెలిపారు. బెంగళూరు లోని ఆటోపాక్ట్‌కు చెందిన ఉద్యోగి సుమిత్ కుమార్ ఉండిపోయిన ప్రయాణికుల్లో ఒకరు. ఉదయం 10 గంటలకు మరో విమానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. బస్సులో 54 మంది కన్నా ఎక్కువ మంది ప్రయాణికులం ఉన్నాం. 6.20కు విమానం బయలు దేర వలసి ఉండగా, ప్రయాణికులు ఎవరూ విమానం ఎక్కడం పూర్తి కాలేదు. 10 గంటల తరువాత మరో విమానంలో మమ్మల్ని ఎక్కించారు.

ఈ విమాన ప్రయాణానికి సంబంధించి నాలుగు బస్సులు ఉన్నాయి. మేం మూడో బస్సులో ఉన్నాం. నాలుగో బస్సులోని ప్రయాణికులను విమానం ఎక్కించారు. మరి మూడో బస్సును గేటు వద్దనే ఎందుకు ఉంచారో తెలియడం లేదు. విమానం బయలు దేరిందా లేదా అని క్షేత్రస్థాయి సిబ్బంది తనిఖీ చేయాలి. మొదట విమానం వస్తుందని చెప్పారు. కానీ టేకాఫ్ కావడంతో నేను సమావేశాలకు మిస్సయ్యాను . డిజిసిఎ ఇంతవరకు స్పందించలేదు. గోఫస్ట్ విమానంలో ఇది నా ఆఖరి ప్రయాణం అవుతుంది ’ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News