Home తాజా వార్తలు ఈత కోసం వెళ్లి విద్యార్థి మృతి

ఈత కోసం వెళ్లి విద్యార్థి మృతి

Student

 

సిద్దిపేట జిల్లా అల్వాల్‌లో ఘటన

దుబ్బాక : ఈతకోసం వెళ్లిన బా లుడు అదృశ్యమై శవమై తేలిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ దయానంద రావు తెలిపిన వివరాల ప్రకారం మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల ఎక్స్‌రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అలిగె కరుణాకర్ (14) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కొంత మంది విద్యార్థులతో గోడ దూకి బయటకు వెళ్లి అల్వాల గ్రామంలోని చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈ సంఘటనలో ఒక విద్యార్థి అచూకీ లభ్యం కాలేదు. తోటి విద్యార్థులను విచారణ చేసిన ఎలాంటి సమాధానం అందలేదు. విషయం బయటకు రావడంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుంట సమీపంలో కరుణాకర్ బట్టలు, చెప్పులను పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా పోలీసులు విద్యార్థి అచూకీ కోసం గజ ఈతగాళ్లతో చెరువును జల్లెడ పట్టగా బుధవారం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కరుణాకర్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గాడుదుల అక్కిరెని గ్రామానికి చెందిన విద్యార్థి అని, పిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దుబ్బాక సీఐ హరికృష్ణ తెలిపారు. విద్యార్థులు పాఠశాల నుండి బయటకు వెళ్తే ప్రిన్సిపల్, సిబ్బంది ఏమి చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్షంగా వ్యహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి..
విద్యార్థి సంఘాల డిమాండ్
విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరవింద్, పీడీఎస్‌యూ జిల్లా సహయ కార్యదర్శి సంధ్యలు డిమాండ్ చేశారు. గతంలో పాఠశాలలో ఉన్న అనేక సమస్యల గురించి సర్వే చేసి ప్రిన్సిపల్‌కు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. కంపౌండ్ గోడకు రంధ్రం ఉన్న విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చిన దాన్ని పెడచెవిన పెట్టారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రిన్సిపల్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Go for a Swim and died the Student