Home జాతీయ వార్తలు ప్రజల్లోకి వెళ్లండి : చంద్రబాబు

ప్రజల్లోకి వెళ్లండి : చంద్రబాబు

Chandrababu-Naiduవిజయవాడ : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించేలా పార్టీ శ్రేణులు పని చేయాలని ఎపి సిఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా , రాష్ట్ర పార్టీ బాధ్యులు , టిడిపి ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటర్ల నమోదుకు మరో 20 రోజులు గడువు ఉందని, అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.