మార్గావో(గోవా) : ఇండియన్ సూపర్ సిరీస్ రెండోసీజన్ పాయింట్ల పట్టికలో గోవా ఎఫ్‌సి రెండోస్థానంలోనే నిలిచి నాకౌట్ ఆశలను మెరుగుపర్చుకుంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 0-4తో ఓడిన గోవా బుధవారం నార్త్ఈస్ట్ యూనైటెడ్తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ప్రథమార్థంలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమైనా 56వ నిమిషంలో సిమావోసబ్రోసా గోల్‌తో నార్త్ఈస్ట్ ఆధిక్యాన్ని సాధించింది. అయితే మరో పదినిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ప్రణయ్ హెల్డర్(80వ) గోల్‌చేయడంతో ఆతిథ్య గోవా మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.