Home ఎడిటోరియల్ టూరిజం గూబ గుంయ్!

టూరిజం గూబ గుంయ్!

ముంబయికి నోట్ల రద్దు తరువాత 20 రోజులకు వచ్చిన ఇద్దరు బ్రిటన్ యువకులు నగదు కొరత సమస్యలో ఇరుక్కొని ఎన్నో ఇబ్బందులుపడ్డారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సహా అనేక దేశాల ప్రభుత్వాలు భారత దేశంలో ఎదురయ్యే నగదు కొరత గురించి సలహాల రూపంలో తమ పౌరులను హెచ్చరించాయి. 

GOA

గోవా పర్యాటక రంగం నవంబర్ 8 తరువాత క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 90 శాతం మంది టూరిస్టులు మూటాముల్లె సర్దుకొని ఆ రాష్ట్రం నుంచి నిష్క్రమిస్తున్నారు. నోట్ల రద్దు ప్రక్రియ కలగ జేసిన ఇబ్బందులే దానికి కారణం. ఇప్పుడు కార్మికులను ఉద్యోగాల నుంచి పంపించివేయక తప్పని పరిస్థితి తలెత్తిందని టూరిస్టు సంబంధ వ్యాపారులు విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చాలా రెస్టారెంట్లు మూతపడే పరిస్థితిలోపడ్డాయి. గత ఏడాది దేశ పర్యాటక- ప్రయాణ రంగం 2.8 వృద్ధితో వేగంగా పురోగమించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ వృద్ధి 2.3 శాతమే. స్థూల దేశీయ ఉత్పత్తికి పర్యాటక రంగం 6.3 శాతం వాటా అందించింది. 2015లో ఈ మొత్తం రూ. 8.3 లక్షల కోట్లు ఉంది. మన పర్యాటకరంగం కార్మిక బలగాన్ని పెంచేది కూడా. ఆ రంగంలో ప్రతి రూ.10 లక్షలపెట్టుబడికి 78 ఉద్యో గాలకల్పన సాధ్యపడుతోంది. అంతే పెట్టుబడికి వ్యవసాయ రంగంలో 45 ఉద్యోగాల కల్పనే సాధ్య మవుతోంది. 2009 నుంచి ఉద్యోగాలకల్పనలో పర్యాటక రంగం వాటా 10 శాతం మించి పెరుగుతోంది. దేశంలోని మొత్తం కార్మిక బలగం సుమారు 50 కోట్లమంది. అంటే పర్యాటక రంగం వాటా సుమారు 5 కోట్ల మంది. ఇది కొలంబియా జనాభా కంటె ఎక్కువ. 2015లో భారత దేశాన్ని సందర్శించిన విదేశీ టూరిస్టుల సంఖ్య దాదాపు 80 లక్షల మంది. దాని వల్ల దేశం రూ.1.3 లక్షల కోట్లు గడించింది. ఇది 2014లో కంటె 9.6 శాతం ఎక్కువ. అయితే ఉత్తర గోవాలోని లఖానీవంటి టూరిస్టు వాణాజ్య సంస్థలు మూతపడితే ఈ వృద్ధి అంతా అనతికాలంలో మాయమవుతుంది. నోట్ల రద్దు ప్రక్రియ ఆ పరిస్థితిని తేవడమే బాధ కలిగించే విషయం.

విదేశీ టూరిస్టులు బెంబేలు
నోట్లరద్దు ప్రకటన తరువాత కొన్ని వారాలలో విదేశీ టూరిస్టులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కేరళ, కర్నాటకలలో కూడా ప్రయాణ, పర్యాటక సంబంధమైన బుకింగ్‌లు వేగంగా తగ్గిపోయాయి. ముంబ యికి నోట్ల రద్దు తరువాత 20 రోజులకు వచ్చిన ఇద్దరు బ్రిటన్ యువకులు నగదు కొరత సమస్యలో ఇరుక్కొని ఎన్నో ఇబ్బందులుపడ్డారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సహా అనేక దేశాల ప్రభుత్వాలు భారత దేశంలో ఎదురయే నగదు కొరత గురించి సలహాల రూపంలో తమ పౌరులను హెచ్చరించా యి. ప్రతి సేవకు బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నందు వల్ల విత్‌డ్రాయల్ పరిమితులు ఆర్థికంగా భారమయ్యాయని కూడా విదేశీ వాపోయారు. అసలు దేశంలోకి 35 శాతం విదేశీయులు విరామం గడపడానికి వస్తారు. అలా నవంబర్‌లో వచ్చిన వారు డబ్బు ఇబ్బందులలోపడి ‘బాబోయ్ ఇండియా’ అనుకొన్నారు. డిసెంబర్ 30 దాకా ఖాతాదారులకు ఎటిఎం చార్జీలు రద్దు చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకుప్రకటిం చింది. కానీ అది విదేశీ బ్యాంకు అకౌంట్ గలవారికి వర్తించదు. ఉదాహరణకు ‘బేకర్-హోవార్డ్’ బ్యాంకు.

డబ్బు విత్‌డ్రా పరిమితుల దెబ్బ
ఎటిఎంలనుంచి విత్ డ్రాలపైరిమితులు విదేశీ టూరిస్టులనే కాక విదేశాలకు వెళ్లే భారతీయులను కూడా ఇబ్బందుల పాల్చేశాయి. రూ.2000మించి విదేశీ కరెన్సీలో సందర్శకులు ఉపసంహరించు కోలేకపోయారు. అది ఏమూలకూ చాలలేదు. వారానికి రూ. 5000 నగదు మాత్రమే డిసెంబర్ 15 దాకా ఉపసంహరించుకోవచ్చని కూడా ఆర్‌బిఐ ఆంక్షలు పెట్టింది. అంతకు ముందు విదేశీ పాస్ పోర్టు ఉన్నవారు 3,000 డాలర్లు ( రూ.200, 000) దాకా డబ్బు మార్పిడి చేసుకొనేవారు. అంటే- నోట్ల రద్దుకు ముందునాటికంటె ఆ తరువాత 2.5 శాతం తక్కువగా మాత్రమే విదేశీ టూరిస్టులు నగదు పరిస్థితి ఎదురైంది. విదేశీ నగదును విదేశీ టూరిస్టులు ‘ ప్రీ పెయిడ్ సాధనం’ రూపేణా మార్చుకొనే సదుపాయాన్ని ఆర్‌బిఐ కల్పించింది. అయితే ఇది విదేశీ నగదులేని పరిస్థితిలో ఉపయోగపడలేదు. నోట్ల రద్దు తరువాత దేశం నుంచి బయటకు వెళ్లినవారు రూ.5000 మినహా తమ సొంత నగదులోకి మార్చుకోలేకపోయారు.

సొంతడబ్బు కోసం పడరాని పాట్లు
యాత్రీకులు ఎక్కువ ఖర్చుచేయడానికి సానుకూలంగా ఉన్నా చిల్లర కొరత వలన ఖర్చు బిగపట్టారు. గోవాలో కొందరు వీధి ప్రక్క వ్యాపారులు తమ వ్యాపారం తిరిగి పుంజుకోవాలనే కోరికతో స్వైప్ మిషన్లకు దరఖాస్తు చేసుకొ న్నారు. కాని అడ్రస్ ప్రూఫ్ లేదంటూ వారిని తిరస్కరించారు. ఇలా నోట్ల రద్దు ప్రక్రియ అనేక విధాలుగా వ్యాపారులను, ముఖ్యంగా చిన్నస్థాయి వారిని కష్టనష్టాలకు గురిచేసింది. ఉత్తర గోవాలోని అంజునా బీచ్ ఏడాది పొడుగునా సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కాని నోట్ల రద్దుతో ఆప్రాం తం అంతా మనుషుల సందడి కొరవడి అనేక మంది వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ గడిపామని ఇద్దరు ఆ ప్రాంతపు హస్తకళా వస్తువుల వ్యాపారులు విచారంగా చెప్పారు. స్వైప్ మిషన్ల కోసం వారు కూడా దరఖాస్తు చేసుకొని భంగపడ్డారు. ఇక్కడకు వచ్చే వారు సొంతడబ్బు ఖర్చుచేసేందుకు వస్తారు. కాని నోట్లరద్దు పరిణామంతో వారి డబ్బు వారిది కాకుం డా పోయినట్లు అయింది. చిన్నచిన్న గుడిసెలు, టెంట్ల వారు గిరాకీ అధికంగా ఉండే కాలాల్లో దుకాణాలు తెరుస్తారు. కాని చిన్న స్థాయి బార్లతో సహా చాలామంది చిన్న వ్యాపారులు స్వైప్ మిషన్ల కోసం ఆర్డరు చేశారు. కాని ఇంకా అందలేదు. ఈ రకంగా నోట్ల రద్దు దెబ్బకు గోవా పర్యాటక రంగం కుదేలైంది. గోవా టూరిజానికి పెద్ద కేంద్రం కనుక ప్రభావం అక్కడ ప్రస్ఫుటంగా కనపడింది. నిజానికి దేశంలోని ప్రధాన టూరిస్టు ప్రదేశాలన్నీ నోట్ల రద్దు తరువాత ఇవే ఇక్కట్లు ఎదుర్కొన్నాయి.

– ముక్తా పాటిల్