Home జాతీయ వార్తలు గోఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ముప్పు

గోఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ముప్పు

GoAir

 

ముంబై : 130 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న గోఎయిర్ జి 8802 విమానానికి సోమవారం తృటిలో ప్ర మాదం తప్పింది. విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా, కుడివైపు ఇంజిన్‌లో మంటలు లేచాయి. పక్షి ఢీ కొనడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విమానంలో ఉన్న ప్రయాణికులను ముగ్గురు సిబ్బందిని వెంటనే దించి వేసి రన్‌వే నుంచి పక్కకు తప్పించారు. సాంకేతిక లోపాన్ని సరిచేసినట్టు గోఎయిర్ సిబ్బంది చెప్పారు. వేరే విమానంలో ప్రయాణికులను పంపించారు.

GoAir engine catches fire, passengers safe