Home జయశంకర్ భూపాలపల్లి 10 గంటల నీటి పాట్లు

10 గంటల నీటి పాట్లు

Godavari flood

 

విలవిలలాడిన 2 వేల జీవాలు
నలుగురు కాపలాదారులు
విముక్తి కల్పించిన అధికార యంత్రాంగం
తప్పిన ప్రాణనష్టం

జలదిగ్బంధంలో మేకల గుంపు

జయశంకర్ భూపాలపల్లి : గోదావరి నది వరద బీభత్సవానికి సుమారు 2 వేల గొర్రెలు, మేకలు కాపలావారు శనివారం అర్ధరాత్రి జలదిగ్బంధంలో చిక్కి విలవిలలాడారు. మండలంలో ఈ వార్తా సంచలంనం సృష్టించింది. మొత్తానికి ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరుగనందున పెద్దప్రమాదం తప్పి యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. ఆ వార్త విని స్పందించిన అధికారులు వాటికి విముక్తి చేసి కొంత మేరకు ఊరట కల్పించారు. జిల్లాలోని పలిమెల మండలం గోదావరి పరీవాహక ప్రాంతంలోని పంకెన రేవు దగ్గరి ఎత్తైన దీవె వద్ద ఈ సంఘటన జరిగింది.

నలుగురు మేకల కాపలాదారులు మూగజీవాలతో దాదాపు 10 గంటల పాటు కటిక చీకట్లో వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా గడిపారు. ఈ క్రమంలోనే ఆ కాపరులలో ఒకరైన ములకల సమ్మయ్య తెగించి తన 400 మేకలతో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ క్రమం లో అధికారుల జోక్యంతో కాపురులైన మారగోని పర్వతాలు, మారగోని కొంరయ్య, బక్కి సతీష్‌లను అధికారులు పడవలో తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

ముంచిన 70 గేట్ల వరద
మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి ఎత్తిన 70 గేట్లతో గోదావరి పరీవాహక ప్రాంతంలోని పంకెన, పలిమెల, లెంకల గడ్డ గ్రామాలలో వరద ఉధృతి పెరిగింది. అయితే గత రెండు మాసాల నుంచి పంకెన సమీపంలోని ఎత్తైన దీవె వద్ద డే రాలు వేసుకొని నలుగురు పశువుల కాపరులు అడవుల లో వాటిని మేపుతూ రాత్రి వేళలో వాటి కాపలాగా ఉండేవారు. దానితో ఒకసారి పెరిగిన వరద ఆ దీవెను చుట్టిముట్టడంతో ఆ రాత్రి ఒంటి గంట సమయానికి తప్పించుకునే వీలులేని కారణంగా వారు ఉదయం పది గంటల వ రకు అక్కడే గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

అంతకు ముం దే తోటి కాపరి ముల్కల సమ్మయ్య ఇచ్చిన సమాచారంతో తహసీల్దార్ మంజుల, ఎంపిపి కురుసం బుచ్చక్క, కాటా రం ఏఎస్పీ సాయిచైతన్య, మహాదేవ్‌పూర్ సీఐ నర్సయ్య, పలిమెల ఎస్సై తిరుపతి రెడ్డి, హుటాహుటిన చేరుకొని రక్షణ చర్యలు చేపట్టి ఒడ్డుకుచేరిన కాపరులకు భోజన సౌకర్యం కల్పించి భరోసా ఇచ్చారు. అయితే మేకలు వర ద నీటిలో ఉన్నందున వాటిని తీసుకొచ్చేందుకు ఆసరవె ల్లి, కాళేశ్వరం నుంచి వచ్చిన పడవలతో ఆ మేకలను అధికారులు ఒడ్డుకు చేర్చారు. దాంతో ఊపరి పీల్చుకున్నారు.

పునరావృతమైన సంఘటన
గత జూన్‌లో పంకెన గ్రామానికి చెందిన గేదెలు ఇదేవిధంగా ఎత్తిన మేడిగడ్డ గేట్ల వరదతో మేతకు వెళ్లివచ్చే 300 గేదెలు వరద ఉధృతికి కొన్ని కొట్టుకుపోగామరికొన్ని ఇదే రేవు వద్ద చిక్కుకోగా అధికారులు అప్పుడు ఇదేవిధంగా వాటిని ఒడ్డుకు చేర్చారు. మేకల కాపరులు మహాదేవ్‌పూర్ మండలం రాపెల్లి కోటకు చెందిన వారు మొత్తానికి మేకలు గొర్రెలతో పాటు కాపరులు కూడా అధికారుల సహాకారంతో క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Goats are caught in the Godavari flood