Home తాజా వార్తలు మహబూబ్ నగర్ లో ఆలయంలో చోరీ

మహబూబ్ నగర్ లో ఆలయంలో చోరీ

THEFT

మహబూబ్ నగర్: ఆలయంలో చోరీ జరిగిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం….  లక్ష్మినారాయణ ఆలయంలో పురాతన విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థుల ప్రమేయంతోనే ఈ చోరీ జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చోరీ చేసిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

God Idols Theft in Mahaboobnagar
Telangana news, Telangana Political news