Home ఆంధ్రప్రదేశ్ వార్తలు బోటు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం

బోటు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి: జిల్లాలోని పాపికొండలు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరో మృతదేహం లభ్యమైంది. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచీ ఓ డెడ్ బాడీ కిందికి కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించడంతో సహాయక సిబ్బంది.. ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నిన్న ఉదయం నాలుగు మృతదేహాలు సహాయక సిబ్బంది వెలికితీసిన విషయం తెలిసిందే. దీంతో మృతుల సంఖ్య 13కి చేరింది. మిగతా వారి ఆచూకి ఇంకా లభించకపోవడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కచ్చలూరు ప్రాంతంలో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, నేవీ బృందాలు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడుతున్నారు.

ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటును అధికారులుల గుర్తించారు. బోటును వెతికేందుకు ఉత్తరాఖండ్ నుంచీ తీసుకొచ్చిన సైడ్ స్కాన్ సోనార్‌… బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్లు కనిపెట్టింది. ప్రస్తుతం ఆ బోటును బయటకి తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తుంది.

Godavari boat capsize:boat found in 315 feet low