Home తాజా వార్తలు దేవాజల

దేవాజల

Medigadda-Barrage

పెరుగుతున్న దేవాదుల బ్యారేజీ నీటిమట్టం

 మేడిగడ్డ గేట్ల ఎత్తివేతతో వస్తున్న గోదావరి జలాలు
 కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌజ్‌లలో మోటార్ల వెట్న్‌క్రు యత్నం

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడిగడ్డ ప్రాజెక్టుకు 7.50 టీఎంసీల నీరు చేరుకోవడం ఆ నీటిని దిగువనున్న బ్యారేజ్‌కి పంపడానికి తెరిచిన 8 గేట్లతో దేవాదుల ప్రాజెక్టుకు భారీ ఎత్తున గోదావరి జలాలు చేరుతున్నాయి. ప్రాణహిత నది ద్వారా వచ్చిన నీటి ఫ్లోతో 14 టీఎంసీల నీరు స్టోర్ అయింది. ఆ నీరు కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి అన్నారం సుందిళ్ల బ్యారేజ్‌లకు 6 టీఎంసీల చొప్పున నీటి నిల్వలకు చేరుకోగా మేడిగడ్డ ప్రాజెక్టులో 7.50 టీఎంసీల నీరుకు చేరుకుంది. గోదావరి నీటిని నిల్వ చేసి ఎత్తిపోతల ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలల్లోని బీడు భూమలకు మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం వచ్చిన నీటిని ఒడిసిపట్టి మోటార్లతో దిగువనున్న ప్రాజెక్టులకు ఎత్తి పోస్తున్నారు. గోదావరి నదిపై ప్రధానంగా ఉన్న ప్రాజెక్టుల్లో కన్నెపల్లి పంప్‌హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్టులు ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నీటి సామర్థం 100 మీటర్లు కాగా గురువారం వరకు 96.5 మీటర్ల వరకు నీరు చేరింది. దాని పూర్తి సామర్థం మేరకు నీరు చేరితే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 30 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తో కన్నెపల్లి పంప్ హౌజ్ వరకు నీరు విస్తరించి ఉంటుంది.

ఈ ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువనున్న తుపాకులగూడెంలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టుకు తరలించవచ్చు. అక్కడ నిర్మించిన బ్యారేజ్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ ప్రాంతాలకు నీటిని పంపింగ్ చేయడం వల్ల ఆ ప్రాంతం సస్యశామలం అవుతుంది. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజ్ నుంచి దిగువనున్న సుందిళ్ల ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. ప్రస్తుతానికి మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌజ్‌ల నుంచి అటు దేవాదులకు ఇటు అన్నారం, సుందిళ్లకు సమాంతరంగా నీరు చేరుతుంది. 14 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు రెండు రోజుల నుంచి నిలిపివేసినప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్‌లోని 37వ నెంబరు గేటు నుంచి 44వ గేటు వరకు మొత్తం 8 గేట్లను తెరిచారు. ఆ నీరు దేవాదుల ప్రాజెక్టు చేరింది. మేడిగడ్డ బ్యారేజ్ నీటి సామర్థం శుక్రవారం నాటికి 7.50 టీఎంసీల నుంచి 6.80 టీఎంసీలకు చేరుకుంది. అంటే దరిదాపుగా ఒక టీఎంసీ నీరు దేవాదుల ప్రాజెక్టుకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు చేరుకుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్‌లోని ఎనిమిది గేట్ల ద్వారా దేవాదుల ప్రాజెక్టుకు గోదావరి జలాలు తరలిపోతున్నాయి.

ఇదిలా ఉంటే కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని మోటార్లను వెట్న్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సుందిళ్ల నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి అధికారులు సిద్ధమయ్యా రు. అందులో భాగంగా సుందిళ్ల ప్రాజెక్టులో మోటార్లను వెట్న్ చేస్తే ఔట్ ఫ్లో నీటికి సమాంతరంగా ఇన్‌ఫ్లో నీరు ఉండే విధంగా కన్నెపల్లి పంప్‌హౌజ్ లోని మోటార్లను వెట్న్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రక్రియ శని, ఆదివారాల్లో ఎప్పుడైనా ప్రారంభించవచ్చనే అభిప్రాయాన్ని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ ముందున్న రిజర్వాయర్‌లోకి 9 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాణహిత నది తగ్గు ముఖం పట్టినా గురువారం రాత్రి మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతంలో భారీ వర్షం పడటంతో దాని వరద గోదావరికి వస్తుంది. మోటార్లు వెట్న్ చేస్తే ఎత్తిపోస్తున్న నీటికి సమాంతర నీరు కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు చేరుకోనుంది.

 Godavari Water Releases From  Medigadda Barrage