Thursday, April 25, 2024

హుస్నాబాద్‌లో జల సవ్వడి

- Advertisement -
- Advertisement -

గౌరవెల్లికి గోదావరి జలాలు

ట్రయల్ రన్ ప్రారంభం లక్ష ఎకరాలకు సాగునీరు

మన తెలంగాణ/అక్కన్నపేట: గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్‌తో గోదావరి జలాలు మెట్టప్రాంతమైన ఉమ్మడి మెదక్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముద్దాడాయి. హుస్నాబా ద్ శాసనసభ్యుడు వొడితెల సతీష్ కు మార్ ఆదివారం అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి పంప్‌హౌస్ వద్ద ట్రయల్ రన్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుందని సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రీ డిజైన్ చేసి లక్షా ఆరు వేల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో సామర్థాన్ని 1.41 టిఎంసి నుంచి 20 టిఎంసిలకు పెంచడం జరిగిందన్నా రు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు ప్రతి ఎకరాకు పవిత్రమైన గోదావరి నీళ్లను తీసుకురావాలన్న కళ నెరవేరింది.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కి, మంత్రి తన్నీరు హరీ శ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మూడు భారీ మెగా బహుబలి మోటార్స్ ఒక్కొక్క మోటార్ 32 మెగావాట్ల సామర్థ్యంతో మూడు మోటార్స్ 96 మెగా వాట్ల సామర్థ్యం కలిగి లక్ష్మీపూర్ పంప్ హౌస్ కంటే పెద్ద హెడ్ కలిగి ఉండి 126 మీటర్ల ఎత్తులోకి నీటిని సరఫరా చేస్తుందన్నారు. ప్రతిపక్షాల కుట్రపూరితమైన చర్యలతో హుస్నాబాద్ రైతులకు నీళ్లు అందించకుండా ప్రాజెక్టు పనులు చేయకుండా అడుగడుగున అడ్డుకున్నారని తెలిపారు. ఆర్‌అండ్‌అర్ ప్యాకేజీ కింద 98శాతం భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందించడం జరిగిందని, కేవలం 84ఎకరాల భూమి సేకరణ మిగిలింది.. కానీ, కాంగ్రెస్, బిజెపి ఇతర నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఎంఎల్‌ఎ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News