Friday, April 19, 2024

‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ లుక్ వస్తోంది

- Advertisement -
- Advertisement -

Godfather movie first look release on july 4

 

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈనెల 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్‌ని ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా తమన్ సంగీతం అందిస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News