Home జనగామ పెంబ‌ర్తిలో బంగారంతో కూడిన లంకెబిందె లభ్యం

పెంబ‌ర్తిలో బంగారంతో కూడిన లంకెబిందె లభ్యం

Gold And Silver Found In Agriculture Land At Pembartiజ‌న‌గామ : జ‌న‌గామ జిల్లా పరిధిలోని పెంబ‌ర్తి లో బంగారం, వెండితో కూడిన లంకెబిందె లభ్యమైంది. న‌ర్సింహా అనే రైతు త‌న వ్యవసాయ భూమిని చ‌దును చేస్తుండ‌గా ఈ లంకెబిందె వెలుగు చూసింది. ఈ లంకె బిందెలో  18 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రెండు కిలోల వెండి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై నర్సింహ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అనంతరం లంకెబిందెను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.