Wednesday, April 24, 2024

పొలంలో గుప్తనిధులు లభ్యం

- Advertisement -
- Advertisement -

Gold and silver ornaments found at parigi vikarabad

మట్టి తవ్వకాల్లో బయటపడ్డ బంగారు, వెండి చెంబులు, ఆభరణాలు

పరిగి : ఓ రైతు వ్యవసాయ పొలంలో మోరం తవ్వుతుండగా బంగారు, వెండి చెంబులు, వివిధ రకాల ఆభరణాలు బయట పడ్డాయి. వికారాబాద్ జిల్లా, పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌నగర్, ఎర్రగడ్డపల్లి ప్రాంతానికి చెందిన సిద్దిక్ అనే వ్యక్తి తన తండ్రి అయూబ్ అలీతో కలిసి మంగళవారం రాత్రి తన పొలంలో జెసిబితో మట్టి తీస్తున్న క్రమంలో 5 బంగారు, వెండి చెంబులు, గాజుల, గొలుసులు, కడియాలు, కమ్మలు వంటివి బయట పడ్డాయి. ఇవి పురాతన వస్తువులుగా గుర్తించి పరిగి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన స్థానిక పోలీసులతో కలసి ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గుప్త నిధులను స్వాధీనం చేసుకొని తహసీల్దార్‌కు అప్పగించారు. తవ్వకాల్లో బయటపడ్డ వాటిలో కొన్నింటిని స్థానికులు తీసుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News