Home బిజినెస్ బంగారం @ 27,000

బంగారం @ 27,000

goldన్యూఢిల్లీ : బంగారం ధర శుక్రవారం రూ.27 వేల మార్కు దా టింది. వరుసగా మూడవ రోజు బంగారం ధర రూ.400 పెరిగి తులం (10 గ్రాముల) ధర రూ.27,250 పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం అమ్మకాలు పెరగడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ బలంగా కొనసాగడంతో బంగారం ధర పెరిగింది. వెండి కూడా రూ.36 వేల మార్కు దాటింది. శుక్రవారం వెండి ధర రూ.1,100 పెరిగి కిలో ధర రూ.36,500 చేరు కుంది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులు కొనగో లులు చేయడంతో వెండి ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర బలపడి ఒక నెల గరిష్టానికి చేరడం, రాబో యే పెళ్లిళ్ల సీజన్ కోసం చిల్లర వర్తకులు కొనుగోలులు చేయడం తో డిమాండ్ రావడంతో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీ య మార్కెట్ న్యూయార్క్‌లో బంగారం ధర 2.11 శాతం పెరిగి ఔన్సు ధర 1,154.10 అమెరికా డాలర్‌లు చేరుకుంది. అగస్టు 24 తరువాత ఇదే అత్యధిక ధర. వెండి ధర 2.43 శాతం పెరిగి ఔన్సు ధర 15.15 అమెరికా డాలర్‌లు పలుకుతోంది.

డాలర్ విలువకు రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ధర పెరగడంతో బంగారం ధర పెరగడానికి కూడా కారణ మైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన 99.9 శాతం, 99.5 శాతం బంగారం ధర రూ.400 పెరిగి తులం (100 గ్రాముల) ధర వరుసగా ధరలు రూ.27,250, రూ.27,100 పలుకుతోంది. ప్రస్తుత స్థాయి ధర అగస్టు 25న ఉంది. బంగారం ధర గత రెండు రోజులలో రూ.340 పెరిగింది. స్టాండర్డ్ బంగారం ధర రూ.100 పెరిగి 8 గ్రాముల ధర రూ.22,500 పలుకుతోంది. వెండి ధర రికార్డు స్థాయిలో రూ.1,100 పెరిగి కిలో ధర రూ.36,500 పలుకుతోంది. వారాంతపు సరఫరా ధర రూ.725 పెరిగి కిలో ధర రూ.36,220 పలుకుతోంది. వెండి నాణాల ధర రూ.1,000 పెరిగి 100 నాణాల కొనుగోలు ధర రూ.53,000 పలుకగా, అమ్మకపు ధర రూ.54,000 పలుకుతోంది.